న్యూజిలాండ్ లోని ఆంక్లాండ్  లోని ఈడెన్ పార్క్ వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే  మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే మొదటివన్డే మ్యాచ్  పరాజయం పాలైన టీమిండియా తాజాగా రెండో వన్డేలో కూడా ఓటమి చవి చూస్తుంది. దీంతో 2-0 తేడాతో వన్డే సిరీస్ను ఆదిత్య న్యూజిలాండ్ జట్టు కైవసం చేసుకుంది. ముందు బ్యాటింగ్ కు దిగిన కివీస్ జట్టు భారత్ ముందు 274 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన టీమిండియా 22 పరుగుల దూరంలో నిలిచి ఓటమిపాలైంది. భారత్ న్యూజిలాండ్ రెండో వన్డే మ్యాచ్ లో  కోహ్లీ వ్యూహాలు ఫలించ లేదు అని చెప్పాలి. దీంతో భారత జట్టు కు నిరాశే ఎదురైంది. అంతకుముందు టి20 సిరీస్ లో న్యూజిలాండ్ క్లీన్ స్వీప్ చేసిన టీం ఇండియా వన్డే సిరీస్ లో మాత్రం న్యూజిలాండ్ కు ఎదురు నిలువలేకపోయింది. 

 


 దీంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. కాగా భారత ఇన్నింగ్స్ లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన బ్యాటింగ్తో మరోసారి మెరుపులు మెరిపించిన్నప్పటికీ సరైన ఆటగాడి  సహకారం లేకపోవడం తో టీమ్ ఇండియా ఓటమి పాలవ్వాల్సి  వచ్చింది. 48.3 ఓవర్లలో 250 పరుగుల వద్ద టీమ్ ఇండియా ఆల్ అవుట్ అయిపోయింది. అయితే కోహ్లీసేన గతేడాది సెంటిమెంట్ ను  ఈసారి కూడా రిపీట్ చేసినట్లు కనిపిస్తోంది... గతేడాది న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన టీం ఇండియా మొదట వన్డే సిరీస్ ను గెలుచుకుంది... ఆ తర్వాత న్యూజిలాండ్ జట్టు టి20 సిరీస్ లో తన సత్తా చాటి టి20 సిరీస్ ను గెలుచుకుంది. ప్రస్తుతం ఈ సంవత్సరం న్యూజిలాండ్ పర్యటనలో కూడా ఇలాంటి గణాంకాలే నమోదయ్యాయి. 

 


 మొదట అద్భుతంగా విజయాలను సొంతం చేసుకుంటూ 5-0 తేడాతో భారీ విజయాన్ని నమోదుచేసి 20 సిరీస్ గెలుచుకుంది కోహ్లీసేన. కానీ ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్తో మాత్రం సత్తా చాట లేకపోయింది. న్యూజిలాండ్ బౌలర్లు అందరూ సమిష్టి కృషితో న్యూజిలాండ్ జట్టు వన్డే సిరీస్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సంవత్సరం న్యూజిలాండ్ పర్యటనలో జరిగిన టీమ్ ఇండియాకు ఒక సిరీస్ కైవసం కాగా న్యూజిలాండ్  మరో  సిరీస్ గెలుచుకుంది. అయితే మొదటి టి20 సిరీస్  క్లీన్స్వీప్ చేయడంతో ఈ సారి వన్డే సిరీస్ కూడా టీమిండియా గెలుచుకుంటుందని అభిమానులు భావించారు. కానీ వన్డే సిరీస్తో కోహ్లీసేన సత్తా చాటలేక  న్యూజిలాండ్ జట్టుకు సిరీస్ ను  కట్టబెట్టేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: