2020 అండర్19 ప్రపంచ కప్ టోర్నీ తుది అంకానికి చేరుకుంది. అందులో భాగంగా ఆదివారం భారత్, బంగ్లాదేశ్ లమధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఇక ఈమ్యాచ్ లో గెలిచి ఎలాగైనా కప్ ను ముద్దాడాలని రెండు జట్లు పట్టుదలతో వున్నాయి. ఈ మెగా టోర్నీ లో ఇప్పటివరకు భారత్ , బంగ్లాదేశ్ జట్లకు ఒక్క ఓటమి కూడా ఎదురుకాలేదు దాంతో రేపు  ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ  పోరు జరగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక  అండర్ 19 ప్రపంచ కప్ లో  బంగ్లాదేశ్ ఫైనల్ కు చేరడం ఇదే మొదటిసారి కాగా డిపెండింగ్ ఛాంపియన్ భారత్ కు ఇది ఆరోసారి. మరి వరసగా రెండో సారి కూడా కప్ ను ముద్దాడి  టీమిండియా అండర్19జట్టు చరిత్ర సృష్టిస్తుందో లేదోచూడాలి. 
 
ఆదివారం మధ్యాహ్నం 1:30గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్ 3, హాట్ స్టార్ లలో  ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఇదిలావుంటే సూపర్ ఫామ్ లో వున్న టీమిండియా  యువ ఓపెనర్  యశస్వి జైస్వాల్ ఇప్పటివరకు ఈటోర్నీ లో ఓ  సెంచరీతోపాటు 3హాఫ్ సెంచరీలు  చేసి  టోర్నీ టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. ఫైనల్ లో కూడా అతను  ఇదే ఫామ్ ను కొనసాగిస్తే ఇండియాకు కప్ గెలవడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: