2020 అండర్ 19ప్రపంచ కప్ లో ఒక్క  ఓటమి లేకుండా ఫైనల్ లోకి అడుగుపెట్టిన  భారత జూనియర్ జట్టు  తుది మెట్టు పై బోల్తా పడింది. ఆదివారం బంగ్లాదేశ్ తో జరిగిన ఫైనల్ లో  టీమిండియా ఓటమిని చవిచూసింది. అయితే కప్ గెలువకున్నా కానీ  తుది వరకు పోరాడి కుర్రాళ్లు ,టీమిండియా అభిమానుల మనసును గెలుచుకున్నారు. ముఖ్యంగా ముంబై ఆటగాడు యశస్వి జైస్వాల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. టోర్నీ ఆద్యాంతం అదరగొట్టి జైస్వాల్ శభాష్ అనిపించుకున్నాడు. ఫైనల్ లో కూడా 88పరుగులతో రాణించినా ఓడిపోవడం తో అతని శ్రమ వృధా అయ్యింది.  ఇక ఈ ప్రపంచ కప్ లో జైస్వాల్ ఓ సెంచరీ తోపాటు  నాలుగు హాఫ్ సెంచరీలతో 400పరుగులు చేసి  టోర్నీ టాప్ స్కోరర్ గా నిలిచాడు.  దాంతో జైస్వాల్ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 
 
అయితే ఈ అవార్డు తీసుకుంటున్న సమయంలో అవార్డు వచ్చిందన్న సంతోషం కన్నా కప్ గెలువలేకపోయామనే బాధే జైస్వాల్ ముఖం లో కనిపించింది. ఇక  పానీపూరి  అమ్మి ట్యాలెంట్ తో  ఈ స్థాయికి వచ్చిన  జైస్వాల్, టీమిండియాకు భవిష్యత్ ఆశాకిరణంగా మారుతాడనడం లో సందేహం అవసరం లేదు.  ఇదిలావుంటే  ఈ కుర్రాడు మళ్ళీ మనకు ఈ ఐపీఎల్ సీజన్ లో కనిపించనున్నాడు. ఇటీవల  జరిగిన వేలం లో 2.40కోట్లకు రాజస్థాన్ రాయల్స్, జైస్వాల్ ను దక్కించుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: