ఆదివారం జరిగిన అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్ లో టీమిండియా అండర్ 19జట్టు పై మూడు వికెట్ల తేడాతో గెలిచి మొదటి సారి ప్రపంచ కప్ ను ముద్దాడింది బంగ్లాదేశ్  అండర్ 19 జట్టు..  ఈమ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 47.2 ఓవర్లలో 177 పరుగులకే ఆల్ ఔట్ కాగా  అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాకు అంత సులభంగా  విజయం దక్కలేదు. ఓ దశలో వరుసగా  వికెట్లు పడడం తో  మ్యాచ్  టీమిండియా చేతుల్లోకి వచ్చింది అయితే పరుగులు ఇవ్వద్దనే ఒత్తిడి లో భారత బౌలర్లు పదే పదే వైడ్లు వేశారు  దాంతో  బంగ్లాకు బాగా కలిసొచ్చింది.
 
లో స్కోరింగ్ గేమ్ లో ఫీల్డింగ్ , ఎక్స్ట్రా పరుగులే మ్యాచ్ ను డిసైడ్ చేస్తాయి అయితే  ఫీల్డింగ్ బాగానే చేసిన  ఎక్స్ట్రా ల రూపంలో రన్స్  ఎక్కువగా ఇవ్వడం తో  టీమిండియా ఓటమి పాలైయ్యింది.  ఏకంగా ఈమ్యాచ్ లో భారత్  33ఎక్స్ట్రా లు ఇచ్చింది. దాంతో  మ్యాచ్  టీమిండియా చేతుల్లోంచి  జారిపోయింది. ఇన్ని ఎక్స్ట్రా లు గనుక ఇవ్వకుంటే ఫలితం భారత్ కు అనుకూలంగా వచ్చేదే.. ఇక  డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ ప్రపంచ కప్ బరిలో నిలిచిన భారత్..  చివరకు రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: