న్యూజిలాండ్ తోమూడు వన్డేల సిరీస్ లో భాగంగా  మొదటి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి సిరీస్ ను చేజార్చుకున్న టీమిండియా ఆఖరి వన్డేలోనైనా  గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తుంది. రేపు ఇరు జట్ల  మధ్య మూడో వన్డే జరుగనుంది. ఇక ఈ మ్యాచ్ లో భారత్ తుది జట్టులో మార్పులు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.  అద్భుతమైన  ఫామ్ లో వున్న మనీష్ పాండే ను కాదని కేదార్ జాదవ్ ను తీసుకున్నందుకు భారత్ భారీ మూల్యం చెల్లించుకుంది. మొదటి వన్డే లో పర్వాలేదనిపించిన జాదవ్ రెండో వన్డే లో దారుణంగా నిరాశపరిచాడు దాంతో చివరి వన్డే కోసం  అతని స్థానంలో మనీష్ జట్టులోకి రావడం దాదాపు ఖాయమైనట్లే. 
 
అలాగే యువ ఓపెనర్లు మయాంక్ , పృథ్వీ షా కూడా రెండు మ్యాచ్ ల్లో నిరాశపరిచారు దాంతో  వీరిద్దరిలో  ఒకరిని తప్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.  అందులో భాగంగా మయాంక్ బెంచ్ కే పరిమితం అయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. పృథ్వీ షా కు  జోడిగా రాహుల్ ను ఓపెనింగ్ కు పంపి మయాంక్ స్థానం లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు అవకాశం ఇవ్వాలని  కోహ్లీ భావిస్తున్నాడు. అయితే బౌలింగ్ విభాగం లో మార్పులేమి వుండకపోవచ్చు. మరోవైపు కివీస్ జట్టులో కూడా  మార్పులు జరుగనున్నాయి. అనారోగ్యం కారణంగా సౌథీ , సాన్ ట్నర్ మూడో వన్డే కు దూరమయ్యారు వారి స్థానాల్లో సోధీ ,టిక్నర్ జట్టులో కి రానున్నారు. ఇక రెండు వన్డేలకు దూరంగా వున్న కెప్టెన్ విలియమ్సన్ రేపటి వన్డే కు అందుబాటులో వుండే అవకాశం వుంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: