టీమిండియాలో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేస్తూ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. టీమిండియాలో కీలకపాత్ర కీలక పాత్ర కొనసాగిస్తూ.. తనదైన బ్యాటింగ్  తో ఎన్నో రికార్డులను సైతం నెలకొల్పాడు. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా 12 బంతుల్లోనే సెంచరీ సాధించి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన  ఆటగాడిగా కూడా ఘనత సాధించాడు. అంతేకాకుండా ఎన్నోసార్లు టీమిండియా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన అద్భుతమైన బ్యాటింగ్తో జట్టును విజయతీరాలకు నడిపించాడు. ఇక ఆ తర్వాత మాయదారి క్యాన్సర్ మహమ్మారి బారిన పడి టీమిండియాకు దూరమై ఆ తర్వాత కేన్సర్ ను జయించి టీమిండియా లోకి అడుగుపెట్టిన తన ఫాంను కొనసాగించలేక పోయారు.దీంతో  క్రికెట్ కు వీడ్కోలు పలికాడు యువరాజు. 

 


 అయితే తాజాగా ఆరు సిక్సుల వీరుడు యువరాజ్ సింగ్  సోషల్ మీడియా వేదికగా టి20 క్రికెట్ కు సంబంధించి ఓ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. టి20 లో డబుల్ సెంచరీ సాధ్యమే అని అంటున్నారు యువరాజ్ సింగ్. టి20 లో డబుల్ సెంచరీ అంటే... అంత ఈజీ కాదు అంటూ తెలిపిన యువరాజ్...  కానీ అది అసాధ్యం కూడా కాదు అని  తెలిపాడు.. ఇప్పుడు క్రికెట్  చూస్తే సాధ్యం కానిది కూడా ఏమీ లేదు అనిపిస్తుంది అంటూ యువరాజ్ సింగ్ తెలిపారు. టి-20లో డబుల్ సెంచరీ సాధించే సత్తా నా దృష్టిలో ముగ్గురు ఆటగాళ్లకు  మాత్రమే ఉంది అని నమ్ముతున్నాను అంటూ  తెలిపాడు. క్రిస్ గేల్, ఎబి డివిలియర్స్,  రోహిత్ శర్మ లకు మాత్రమే టి-20లో డబుల్ సెంచరీ సాధించే  సత్తా ఉంది అంటే యువరాజ్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 


 అయితే ఇప్పటికే టీ20ల్లో శతకాలు సాధించిన వారిలో రోహిత్ శర్మ టాప్ ప్లేస్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. టి20ల్లో 4 శతకాలు సాధించిన రోహిత్ శర్మ ప్రస్తుతం టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు. టీం ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తరఫున ఇంకా ఏ క్రికెటర్ చేరలేదు. ఆసిస్ ఆటగాడు మాక్స్వెల్ న్యూజిలాండ్ క్రికెటర్ కొలిన్ మున్రో లు  తలో  మూడు సెంచరీలు సాధించి రోహిత్ తర్వాత రెండో స్థానంలో ఉన్నారు. అంతర్జాతీయ టీ20 లో అత్యధిక వ్యక్తిగత స్కోరు ఆసీస్ ఆటగాడు ఆరోన్ ఫించ్ పేరిట ఉంది. 172 పరుగులతో ఆరోన్ ఫించ్ మొదటి స్థానంలో ఉన్నారు. ఓవరాల్ టి20 లో అత్యధిక స్కోరు క్రిస్ గేల్  పేరిట ఉంది. 2013లో ఆర్సిబి తరుపున అజేయంగా 175 పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు గేల్ .

మరింత సమాచారం తెలుసుకోండి: