ఆటతోనే కాకుండా తన అందం, ఫిజిక్ తో సెన్షేషన్ క్రియేట్ చేసిన క్రీడాకారిణి సానియా మీర్జా. టెన్నీస్ లో అనేక విజయాలు సాధించిన అనంతరం పెళ్లి చేసుకుని లైఫ్ లో కూడా సెటిల్ అయింది. గతేడాది తల్లి కూడా అయిన సానియా మీర్జా ఇప్పుడు మళ్లీ ఆటపై దృష్టి పెడుతోంది. అయితే ఈ క్రమంలో తీసుకున్న విశ్రాంతికి ఆమె బాగా బరువు పెరిగిపోయింది. ఆటపై దృష్టి పెట్టాలనుకున్న సానియాకు మితిమీరిన బరువు తగ్గించుకోవడం తప్పనిసరి. దీంతో గత ఏడాది మళ్లీ ఫిట్ నెస్ పై దృష్టి సారించింది.

 

 

నాలుగు నెలల క్రితం ఫిట్ నెస్ కోసం మొదలు పెట్టిన సాధనలో ఆమె విజయం సాధించింది. 89 కిలోల బరువు నుంచి ఈ నాలుగు నెలల్లో 63 కిలోలకు తగ్గి ఇదివరకటిలా మా నాజూకుగా మారిపోయింది. ఈ మార్పు గురించి తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాలో మునుపటి ఫోటో.. ప్రస్తుత ఫోటోను పోస్ట్ చేసింది ‘మునుపటిలా తయారవడానికి నాకు నాలుగు నెలల సమయం పట్టింది. ఈ నాలుగు నెలల్లో 26 కిలోల బరువు తగ్గాను. మనకెన్నో గోల్స్ ఉంటాయి. వాటిని సాధించాలంటే శ్రమించాల్సిందే. బాబు పుట్టాక మళ్లీ ఆట ఆడాలన్న నా ఆకాంక్షను మళ్లీ నెరవేర్చుకోబోతున్నాను. ఈ ప్రయాణంలో ఎంతోమంది వెనక్కు లాగాలని చూసినా మనకున్న సామర్ధ్యంతో ముందుకెళ్లాల్సిందే. మళ్లీ ఇదివరకటిలా ఫిట్ నెస్, గోల్స్ సాధించాలంటే ఇది తప్పనిసరి’ అంటూ  రాసుకొచ్చింది.

 

 

సానియాలో వచ్చిన మార్పుకు నెటిజన్ల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ‘నీ అందం ఏమాత్రం తగ్గలేదు..’, ’ఏం డైట్ పాటించావో చెప్తావా..’ అంటూ సానియాను అభినందిస్తున్నారు. ఇండియాలో మహిళల టెన్నీస్ లో సంచలనాలు సృష్టించి గుర్తింపు తీసుకొచ్చింది. రాష్ట్రస్థాయి నుంచి వింబుల్డన్ వరకూ ఎన్నో విజయాలు సాధించి ఔత్సాహిక క్రీడాకారిణులకు ఆదర్శంగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: