ఇక క్రికెట్ మ‌రింత విశ్వ‌వ్యాప్తం కానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఐసీసీ క్రికెట్ విష‌యంలో చాలా ప‌రిమితంగా వెళ్లిన ఐసీపీ ఇప్పుడు క్రికెట్‌ను మ‌రింత‌గా విశ్వ‌వ్యాప్తం చేసే చ‌ర్య‌లు చేప‌ట్టింది. బారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్ర్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, జింబాబ్వే, వెస్టిండీస్, సౌతాఫ్రికా లాంటి సాంప్రదాయ టెస్ట్ హోదా పొందిన దేశాలకు మాత్రమే కాకుండా…. ఐసీసీకి అనుబంధంగా ఉన్న జపాన్, నైజీరియా, అమెరికా, కెనడా, గ్రెనెడా, ఫిజీ, థాయ్ లాండ్, నేపాల్ లాంటి దేశాలకు సైతం క్రికెట్ ను విస్తరింపచేయడంలో సఫలమయ్యింది. ఐర్లాండ్, అప్ఘనిస్థాన్ లాంటి జట్లను సైతం.. టెస్ట్ పొందిన దేశాలుగా గుర్తించింది.

 

ఇక ఇప్పుడు క్రికెట్‌ను మ‌రింత విస్త‌రించేందుకు, మ‌రింత క్రేజ్ గేమ్‌గా మార్చేందుకు ఐసీపీ ఏకంగా 50 లక్షల డాలర్ల బడ్జెట్ తో చర్యలు చేపట్టింది. ఇక ప్ర‌స్తుతం ఐసీసీలో మొత్తం 92 అనుబంధ దేశాలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలిలో శాశ్వతసభ్యత్వం కలిగిన దేశాలు 11 వరకూ మాత్రమే ఉంటే…అనుబంధదేశాలు 92 వరకూ ఉన్నాయి. ఇక గ్లోబ‌ల్ క్రికెట్లో 20-20 టోర్న‌మెంట్‌ల‌ను విరివిగా నిర్వ‌హించ‌డం ద్వారా క్రికెట్‌ను గ‌త కొద్ది రోజులుగా మ‌రింత  విస్త‌రిస్తోంది.

 

ఇక ఇటీవ‌ల సౌతాఫ్రికా వేదికగా ముగిసిన 2020 అండర్ -19 ప్రపంచకప్ లో నైజీరియా, జపాన్ యువజట్లు తొలిసారిగా తలపడితే త్వ‌ర‌లోనే ఆస్ట్రేలియా వేదిక‌గా స్టార్ట్ అయ్యే మ‌హిళా టీ -20 క్రికెట్ ప్ర‌పంచ‌క‌ప్‌లో థాయ్‌లాండ్ సైతం తొలిసారిగా బ‌రిలోకి దిగుతోంది. ఐసీసీ నిర్వహించిన ప్రపంచకప్ వివిధ అర్హత టోర్నీలలో 11 అనుబంధ దేశాలజట్లు తొలిసారిగా పాల్గొన్నాయి. ఓవ‌రాల్‌గా ఈ భూఖండంలో మొత్తం 240 దేశాలు ఉంటే వీటిల్లో 99 దేశాల వరకూ క్రికెట్ ను విస్తరింప చేయడంలో ఐసీసీ స‌క్సెస్ అవ్వ‌డం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: