భారతదేశంలో కోట్ల మంది ప్రజలు క్రికెట్ ఆటను ఆరాధిస్తారు అన్న విషయం తెలిసిందే. క్రికెట్ మ్యాచ్ వస్తుంది అంటే టీవీలకు అతుక్కుపోయి మరి మ్యాచ్  వీక్షిస్తూ ఉంటారు.ఆటగాళ్ళు  అద్భుత ప్రదర్శన చేస్తూ విజయాలు సాధిస్తుంటే ఆటగాళ్ళ కంటే ఎక్కువ ఆనంద పడి పోతూ ఉంటారు ప్రేక్షకులు.టీవీల ముందు నుంచే టీమిండియాను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అయితే ఇండియన్ క్రికెట్ అభిమానులకు కొత్త సంవత్సరంలో కాస్త చేదు అనుభవాలు ఎదురవుతున్నట్లు  తెలుస్తుంది. ఎందుకంటే వరుస సిరీస్లను  గెలుచుకుంటూ  అద్భుతమైన ప్రదర్శన చేస్తూ దూసుకుపోతున్న టీమిండియా జట్టు  న్యూజిలాండ్ బ్రేక్ వేసిన  విషయం తెలిసిందే. వరుస విజయాలను సొంతం చేసుకొంటున్న కోహ్లీసేన... న్యూజిలాండ్ వన్డే సిరీస్ ను చేజార్చుకుంది. మొదట న్యూజిలాండ్ టి20 సిరీస్ లో క్లీన్స్వీప్ చేయగా... వన్డే సిరీస్ లో ఇండియా ను క్లీన్ స్వీప్ చేసింది న్యూజిలాండ్. అయితే 31 ఏళ్ల తర్వాత టీమిండియా క్లీన్ స్వీప్ కావడం గమనార్హం. 

 

 

 ఇదిలా ఉంటే అటు అండర్ 19 జట్టు ఇటీవలే ప్రపంచకప్ ఆడిన విషయం తెలిసిందే. మొదటి నుంచి అన్ని మ్యాచులు గెలుస్తూ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది అండర్ 19 జట్టు . టీమిండియా యువ సంచలనాలు అందరూ ఫైనల్ వరకు దూసుకెళ్లారు. ఎలాంటి అవాంతరాలు ఎదురైనా ఫైనల్ వరకు వెళ్ళింది అండర్-19 టీమిండియా జట్టు. ఫైనల్లో  బంగ్లాదేశ్ తో పోటీ పడింది. అయితే అప్పటి వరకు వరుస విజయాలను సొంతం చేసుకుంటూ ఫైనల్ వరకు వెళ్లి అభిమానుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తించినా అండర్-19 టీమ్ ఇండియా జట్టు... ఫైనల్లో మాత్రం నిరాశ పరిచింది అని చెప్పాలి. ప్రపంచకప్ ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో  టీమిండియా అండర్-19 జట్టు ఓడింది. దీంతో ఇక్కడ అభిమానులకు నిరాశే ఎదురైంది. 

 

 

 ఇప్పుడు మరోసారి అభిమానులకు నిరాశే ఎదురైంది. ఉమెన్ టి20 ట్రై సిరీస్లో ఓటమిని చవిచూసింది భారత మహిళల జట్టు. ఉమెన్స్ టి20 సిరీస్ను ఆస్ట్రేలియా దక్కించుకుంది.  చివరి 20 మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుని  బరిలోకి దిగింది. ఈ నేపథ్యంలో 20 వరకు 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన భారత మహిళల జట్టు కేవలం 144 పరుగులకే ఆలౌట్ ఐపోయింది. దీంతో ఇండియన్ క్రికెట్ అభిమానులకి  మహిళల జట్టు కూడా నిరాశపరిచింది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: