బుధవారం సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ ల మధ్య జరిగిన మొదటి టీ 20మ్యాచ్  అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చింది.  చివరి ఓవర్ లో ఇంగ్లాండ్ గెలుపుకు 7పరుగులు అవసరం కాగా మూడు వికెట్లు కోల్పోయి 5పరుగులే చేయడం తో ఒక్క పరుగు తేడాతో  సౌతాఫ్రికా  థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. చివరి ఓవర్ ఎలా సాగిందంటే.. ఎంగిడి వేసిన మొదటి బంతికి టామ్ కర్రాన్ 2పరుగులు తీయగా రెండో బంతికి మిల్లర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు, మూడో బంతికి మొయిన్ అలీ పరుగులేమి చేయలేకపోగా నాల్గో బంతికి రెండు పరుగులు తీశాడు. ఇక ఐదో బంతికి అలీ అవుట్ కాగా చివరి బంతికి రెండు పరుగులు తీసే క్రమంలో అదిల్ రషీద్ రన్ అవుట్ అయ్యాడు. దాంతో సౌతాఫ్రికా  విజయం సాధించింది.
 
ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20ఓవర్ల లో 8వికెట్ల నష్టానికి 177పరుగులు చేసింది. బావుమా(43),కెప్టెన్ డికాక్ (31),వాన్ డెర్ దుస్సేన్ (31)రాణించారు. అనంతరం ఇంగ్లాండ్ 20ఓవర్ల లో 9వికెట్ల నష్టానికి 176పరుగులు మాత్రమే చేసి  ఓటమిని చవిచూసింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ లలో ఓపెనర్ రాయ్ (70),కెప్టెన్ మోర్గాన్(52) రాణించారు. చివరి ఓవర్ అద్భుతంగా బౌల్ చేసి జట్టును గెలిపించిన సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఎంగిడికి ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో భాగంగా రెండో టీ20 శుక్రవారం జరుగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: