ప్రపంచవ్యాప్తంగా క్రికెట్కు ఎంతటి  క్రేజ్ ఉందొ  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అంటే స్టేడియం లోకి వెళ్లి లైవ్ క్రికెట్ వీక్షించే ప్రేక్షకులు కొంత మంది అయితే టీవీల ముందు కూర్చొని క్రికెట్ ను వీక్షించే ప్రేక్షకులు కొంత మంది. అయితే ప్రపంచ దేశాల్లో క్రికెట్ కు ఉన్న క్రేజ్ కంటే మన భారతదేశంలో ఆ క్రేజ్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్టేడియం లోకి వెళ్ళడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు ప్రేక్షకులు. కానీ స్టేడియంలో ప్రేక్షకులు క్రికెట్ను వీక్షించేందుకు ఎంత సామర్థ్యం ఉందో అంత మేరకు ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తూ  ఉంటారు నిర్వాహకులు. దీంతో ఈ స్టేడియం కాస్త ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండేది ఎక్కువ మంది ప్రేక్షకులు పెడితే మరింత ఎక్కువ మజాతో  క్రికెట్ ని వీక్షించవచ్చు అని అనుకోని  ప్రేక్షకులు ఉండరు. 

 

 

కాగా  ప్రపంచంలో ఉన్న క్రికెట్ స్టేడియం లో కొన్ని అతి చిన్న వైతే కొన్ని మామూలుగా ఉంటాయి. మరి ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏది అంటే ఆస్ట్రేలియా లో ఉండే మెల్బోర్న్ స్టేడియం. ఈ స్టేడియంలో ఒక మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఏకంగా ఒక లక్షా ఇరవై నాలుగు మంది ప్రేక్షకులు ఈ స్టేడియంలో కూర్చొని హాయిగా క్రికెట్ను వీక్షించే వీలు ఉంటుంది. ఇప్పుడు వరకు ప్రపంచంలోని ఏ స్టేడియం లో కూడ ఇంత మొత్తంలో సామర్థ్యం గల స్టేడియం లేదు. దీంతో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ స్టేడియం కి ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం ఘనత దక్కింది. 

 

 

 ఇకపోతే ప్రస్తుతం ఈ ఘనత కాస్త ఇండియాలోని స్టేడియం దక్కబోతూన్నట్లు తెలుస్తోంది. ఇండియాలో ఎక్కువ మంది ఆడే చూసే ఆట ఏది అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది క్రికెట్. ఇండియాలోని ఎంతో మందిని క్రికెట్ ఎంతగానో ప్రభావితం చేస్తుంది. అందుకే క్రికెట్ ప్రేక్షకుల సౌకర్యార్థం ఇండియాలో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం నిర్మించారు. అది ఎక్కడ అనుకుంటున్నారా... భారత్లోని అహ్మదాబాద్ మొతేరా  స్టేడియం. ఈ స్టేడియంలో ఒకే ఒకసారి ఒక లక్షా పదివేల మంది ప్రేక్షకులు మ్యాచ్ ను వీక్షించే  సామర్థ్యం కలిగి ఉంది.  ఇంతకు ముందు ఇక్కడ ఉన్న స్టేడియానికి కూల్చేసి  కొత్తగా అతి పెద్ద స్టేడియాన్ని నిర్మించారు. కాగా ఈ స్టేడియాన్ని ఈ నెల 24న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రారంభించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: