టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో అడుగు పెడితే ఏ స్థాయిలో ఆడతాడో అందరికి తెలిసిందే. రికార్డులు అన్నీ కూడా తన బ్యాట్ కింద జాలువారాల్సిందే. దిగ్గజ ఆటగాళ్లకు కూడా సాధ్యం కాని ఎన్నో రికార్డులను కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పట్లో అంతర్జాతీయ క్రికెట్ లో ఏ ఫార్మాట్ లో అయినా సరే కోహ్లీ దాటే ఆటగాడు లేడు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అంతర్జాతీయ క్రికెట్ లో ఆ విధంగా కోహ్లీ ముద్ర వేసాడు. 

 

క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డులు కూడా ఒక్కొక్కటి కనుమరుగు అవుతూ వస్తున్నాయి. ఇక కోహ్లీ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే అతని లవ్ స్టోరీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంతకు ముందు ఎన్నో ప్రేమ కథలు నడిపిన కోహ్లీ బాలీవుడ్ నటి అనుష్క శర్మ వద్దకు వచ్చేసరికి ఆగిపోయాడు. ఆమెతో ప్రేమలో మునిగితేలాడు. అప్పటి వరకు కోహ్లీ సాఫ్ట్ బాయ్ అనుకున్నారు అంతా. 

 

కాని ఒక్కసారిగా గేర్ మార్చి ఆమెను ఫిదా చేసాడు. ప్రేమలో పడిన కొత్తలో ఆస్ట్రేలియా సీరీస్ కి వెళ్ళిన కోహ్లీ అక్కడ తనదైన ఆట తీరుతో రెచ్చిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్ లో కోహ్లీకి అదే బెస్ట్ సీరీస్. అయితే ఆ తర్వాత సుల్తాన్ సినిమాలో పెట్టుబడులతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. సుల్తాన్ సినిమాలో పెట్టుబడులు పెట్టవద్దని ఆమెను విరాట్ కోరినా అందుకు అంగీకరించలేదు అనుష్క. 

 

దీనితో ఇద్దరి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అప్పటి నుంచి దూరంగా ఉన్న ఈ ఇద్దరు 2017 తర్వాత కలిసారు. ఆ సమయంలో కోహ్లీ... వివాహానికి కూడా రెడీ అయ్యాడు. అందుకోసం గడ్డం కూడా పెంచుకున్నాడు. ఆమె కోసం తన బంధువు ఒకరిని రంగంలోకి దింపాడని, ఆ తర్వాత ఆమెకు మంచి ఫ్రెండ్ అయిన రణవీర్ సింగ్ తో కూడా మాట్లాడాడని, ఆమెను ఒప్పించడానికి గాను చాలా కష్టపడ్డాడు అని చెప్తూ ఉంటారు. చివరకు ఆమెను 2018 లో వివాహం చేసుకున్నాడు కోహ్లీ.

మరింత సమాచారం తెలుసుకోండి: