గత కొంత కాలంగా విరామం లేకుండా తమ ఆటగాళ్లు  క్రికెట్ ఆడుతుండడం తో పాకిస్థాన్ తో జరగాల్సిన టీ 20సిరీస్ ను రద్దు చేసుకున్నట్లు  సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు, పీసీబీకి తేల్చిచెప్పింది. మార్చి చివర్లో సౌతాఫ్రికా, పాకిస్థాన్ లో పర్యటించాల్సి వుంది. అందులో భాగంగా పాక్ తో సౌతాఫ్రికా మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో తలపడాల్సి ఉంది. అయితే గత ఏడాది ఇండియా పర్యటన దగ్గర నుండి దక్షిణాఫ్రికా విరామం లేకుండా క్రికెట్ ఆడుతుండడం అలాగే మరి కొద్దీ రోజుల్లో ఐపీఎల్ స్టార్ట్ కానుండడంతో ఆటగాళ్లకు మరింత శ్రమను కలిగించలేమని అందుకే ఈ టూర్ ను ప్రస్తుతానికి రద్దు చేసుకుంటున్నట్లు సీఎస్ఏ వెల్లడించింది. 
 
ఇక ప్రస్తుతం సౌతాఫ్రికా సొంత గడ్డపై ఇంగ్లాండ్ తో టీ 20సిరీస్ లో తలపడుతుంది. మూడు మ్యాచ్ ల టీ 20సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో సౌతాఫ్రికా విజయం సాధించగా ఇరు జట్ల మధ్య  ఈరోజు రెండో మ్యాచ్ జరుగనుంది. ఈసిరీస్ ముగిశాక ఆస్ట్రేలియా,సౌతాఫ్రికా లో పర్యటించనుంది. అందులో  భాగంగా ఇరు జట్ల మధ్య టీ 20, వన్డే సిరీస్ జరుగనుంది. మార్చి 7న ఈ పర్యటన ముగియనుంది. ఆతరువాత మార్చి12నుండి ఇండియా తో సౌతాఫ్రికా మూడు వన్డేలు ఆడనుంది. చివర్లో ఐపీఎల్ స్టార్ట్ కానుంది.  వీటిని దృష్టిలో పెట్టుకొని తమ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశం తో పాక్ టూర్ ను క్యాన్సల్ చేసుకున్నట్లు సిఏస్ ఏ పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: