సౌతాఫ్రికా కెప్టెన్, వికెట్ కీపర్ డికాక్ డర్బన్ లో ఇంగ్లాండ్ తో  జరుగుతున్న రెండో టీ 20 లో సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం అతను 17బంతుల్లోనే 6సిక్సర్లు, ఓ ఫోర్ సాయం తో 50పరుగులు చేసి టీ 20ల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ గా రికార్డు సృష్టించాడు. ఈమ్యాచ్ లో భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు... ఓపెనర్లు డికాక్, బావుమా అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. బావుమా  నిదానంగా ఆడగా డికాక్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 22బంతుల్లోనే డికాక్ 8సిక్సర్లు ,2ఫోర్ల సాయంతో 65పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 10ఓవర్ల లో 2వికెట్ల నష్టానికి 102పరుగులు చేసింది. 
 
మిల్లర్, వన్ డేర్ దుస్సేన్ క్రీజ్ లో వున్నారు. ఇక అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ .. మొయిన్ అలీ 11బంతుల్లో 39పరుగులు చేసి మెరుపులు మెరిపించడం తో నిర్ణీత 20ఓవర్ల లో 7వికెట్ల నష్టానికి 204పరుగులు చేసింది. మూడు టీ 20 ల సిరీస్ లో భాగంగా మొదటి  మ్యాచ్ లో సౌతాఫ్రికా  విజయం సాధించింది.  ఇక ఈమ్యాచ్ లో కూడా  ప్రొటీస్ జట్టు విజయం సాధిస్తే 2-0తో సిరీస్ ను కైవసం చేసుకోనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: