రిషబ్ పంత్... దాదాపు రెండేళ్ళ క్రితం జరిగిన ఇంగ్లాండ్ పర్యటనలో అతను చేసిన ప్రదర్శన ఆ తర్వాత 2019 ఆరంభంలో ఆసిస్ జట్టుపై ఆ గడ్డపై చేసిన ప్రదర్శన అతన్ని టీం ఇండియా భవిష్యత్తు గంగూలీ అనుకున్నారు. ఎడమ చేతి వాటం బ్యాటింగ్ లో అతని ఆటకు విమర్శకులు కూడా ఫిదా అయిపోయిన సందర్భాలు ఉన్నాయి అనేది వాస్తవం. భారీ సిక్సులు కొట్టడమే కాకుండా అమాంతం స్కోర్ బోర్డు ని పెంచే సామర్ధ్యం అతని సొంతం. 

 

అయితే వచ్చిన అవకాశాలను మాత్రం పంత్ చక్కగా వినియోగించుకోలేకపోయాడు అనేది వాస్తవం. అతని అవసరం జట్టుకు ఉంది అనే కోహ్లీ అవకాశాలు ఇస్తూ వచ్చాడు. అయినా సరే పంత్ మాత్రం ఈ విషయంలో జట్టుని మోసం చేసాడు అంటారు క్రీడా పండితులు. ఏ స్థానంలో అయినా సరే బ్యాటింగ్ చేయగలిగే సామర్ధ్యం ఉన్నప్పుడు దాన్ని వినియోగించుకోవడంలో పంత్ ఘోరంగా విఫలం అయ్యాడు. 

 

దీనితో ఇప్పుడు అతని స్థానాన్ని కెఎల్ రాహుల్ తో భర్తీ చేసాడు కోహ్లీ. ఏ స్థానంలో అయినా సరే ఆడగలిగే సామర్ధ్యం కెఎల్ రాహుల్ సొంతం. కీపింగ్ కూడా అదే స్థాయిలో చేస్తున్నాడు. దీనితో కోహ్లీ ఇక రాహుల్ నే నమ్ముకున్నాడు. పంత్ ఇప్పట్లో తుది జట్టులో స్థానం సంపాదించుకోవడం అనేది దాదాపుగా అసాధ్యం అంటున్నారు అభిమానులు. క్రీడా పండితులు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: