ప్రస్తుతం టీమిండియా, న్యూజిలాండ్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే ఆతిథ్య జట్టు తో టీ 20 , వన్డే సిరీస్ లలో తలపడగా టీ 20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి.. వన్డే సిరీస్ ను వైట్ వాష్ చేయించుకుంది. ఇక ఇరుజట్ల మధ్య ఈనెల 21నుండి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్టు సిరీస్ కు ముందు టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది బీసీసీఐ.. ఇంతకీ ఆ న్యూస్  ఏంటంటే.. టెస్టు స్పెషలిస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ,జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ పరీక్షలో పాస్ అయ్యాడు. దాంతో ఇషాంత్, కివీస్ టెస్టు సిరీస్ కు అందుబాటులో ఉండనున్నాడు. రేపే ఇషాంత్ న్యూజిలాండ్ బయల్దేరి వెళ్ళనున్నాడు. 
 
ఇక ఇటీవల రంజీ మ్యాచ్ లో గాయపడడం తో ఇషాంత్ , న్యూజిలాండ్ పర్యటనకు అందుబాటులో ఉంటాడా అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. అయితే గాయం నుండి కోలుకున్నాక  ఫిట్నెస్ పరీక్షలో పాస్ అయితే ఇషాంత్ అందుబాటులో ఉంటాడని బీసీసీఐ, టెస్టు జట్టును ప్రకటించే సమయంలో వెల్లడించింది. తాజాగా ఇషాంత్, ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేయడంతో అతను టీమిండియాతో కలవనున్నాడు. ఇషాంత్ రాకతో  భారత బౌలింగ్ విభాగం మరింత బలంగా కనిపిస్తుంది. 
 
 టెస్టు జట్టు : 
 
విరాట్ కోహ్లీ (కెప్టెన్) ,పృథ్వీ షా , మయాంక్ అగర్వాల్ ,రిషబ్ పంత్ , పుజారా  , రహానే , సాహా ,హనుమ విహారి ,అశ్విన్ , బుమ్రా ,షమీ , ఉమేష్ యాదవ్ ,రవీంద్ర జడేజా ,గిల్ , సైని ,ఇషాంత్ శర్మ 

మరింత సమాచారం తెలుసుకోండి: