వినోదం తోపాటు కాసుల వర్షం కురిపించే పొట్టి క్రికెట్ లీగ్  ఐపీఎల్..  ప్రతి ఏడాది సక్సెస్ అవుతూ ఎనలేని ఆదరణను పొందుతుంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం కూడా క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఐపీఎల్ 2020 షెడ్యూల్ కూడా వచ్చేసింది. మార్చి 29న ఈసీజన్ ప్రారంభమై మే 24న ముగియనుంది. మొదటి మ్యాచ్ మార్చి 29న ముంబై ఇండియన్స్ ,చెన్నై సూపర్ కింగ్స్ జట్ల  మధ్య వాంఖడే స్టేడియం లో జరుగనుండగా ఫైనల్ కూడా అక్కడే జరుగనుంది. 
 
ఇక గత  ఏడాది ఐపీఎల్ 44రోజులు జరుగగా ఈ సారి ఐపీఎల్ 50రోజులు జరుగనుంది అలాగే  గత సీజన్లలలో శనివారాలు కూడా రెండు మ్యాచ్ లు జరుగగా ఈ సీజన్ లో మాత్రం ఒకటే మ్యాచ్ జరుగనుంది. ఆదివారాలు మాత్రం  రెండు మ్యాచ్ లు జరుగనున్నాయి. అయితే మ్యాచ్ టైమింగ్స్ లో ఎలాంటి మార్పులు లేవు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే మొదటి మ్యాచ్ ను  ఏప్రిల్1న హోం గ్రౌండ్ ఉప్పల్ లో ముంబై తో ఆడనుంది.
 
ఇదిలా ఉంటే ఐపీఎల్ స్టార్ట్  అయ్యే మూడు రోజుల ముందు ఆల్ స్టార్స్ పేరిట ఛారిటీ మ్యాచ్ ను నిర్వహించనున్నామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ ఆల్ స్టార్స్ మ్యాచ్ కోసం ఎనిమిది జట్లు, రెండు జట్లు గా విడిపోనున్నాయి. అందులో భాగంగా పంజాబ్, రాజస్థాన్ , కోల్ కత్తా , ఢిల్లీ ఒక టీం గా ఏర్పడనుండగా చెన్నై, హైదరాబాద్, ముంబై,  బెంగళూరు  మరో టీం గా ఏర్పడనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: