టీం ఇండియా పేస్ గన్ జస్ప్రీత్ బూమ్రా... ప్రస్తుతం టీం ఇండియాకు బౌలింగ్ కెప్టెన్, వన్డే అయినా టెస్ట్ అయినా టి20 అయినా సరే ప్రత్యర్ధులను ముప్పతిప్పలు పెడుతూ ఉంటాడు. అతని బౌలింగ్ ఎదుర్కోవడానికి బ్యాటింగ్ కోచ్ లు కూడా తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు. స్టార్ బ్యాట్స్మెన్ లకు కూడా ట్రైనింగ్ ఇస్తూ అతని బంతిని ఏ విధంగా అంచనా వెయ్యాలో చెప్తూ ఉంటారు. 

 

అంత వరకు బాగానే ఉంది గాని కివీస్ పర్యటనలో ఇతను తేలిపోవడమే టీం ఇండియాని కలవరపెట్టే అంశంగా చెప్పుకోవచ్చు. వన్డే సీరీస్ లో అయితే పరుగులు ఇవ్వడమే గాని బ్యాట్స్మెన్ ని ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు. లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా అతని బౌలింగ్ లో ఎంతో స్వేచ్చగా బౌలింగ్ చేసారు అనేది మ్యాచ్ చూసిన అందరికి స్పష్టంగా అర్ధమవుతుంది. శమీ లాంటి బౌలర్ ని కాదని ఇతన్ని తీసుకుంటే జట్టుని నిరాశ పరిచాడు అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. 

 

ఇక ఇదే సమయంలో సోషల్ మీడియాలో అతనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సరైన బ్యాట్స్మెన్ తగిలితే బూమ్రా ను అర్ధం చేసుకోవడం పెద్ద కష్టం కాదని అంటున్నారు. అతని యార్కర్లు ఏమీ పెద్ద గొప్పగా ఉండవని, యుట్యూబ్ లో వీడియోలు చూస్తే స్పష్టంగా అర్ధమవుతాయని, కాబట్టి అతన్ని ఎదుర్కోవడం ఏ బ్యాట్స్మెన్ కి కష్టం కాదని, కాబట్టి అతని స్థానంలో ప్రత్యామ్నాయం చూడాలని కోహ్లీకి సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: