గత ఏడాది నవంబర్ లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ తో మొదటి డే-నైట్ టెస్టులో తలపడింది టీమిండియా. ఈటెస్టులో భారత్ సునాయాస విజయాన్ని సాధించింది. ఇక టీమిండియా రెండో పింక్ బాల్ టెస్టు ఎవరితో ఆడనుందో అనే విషయం లో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ క్లారిటీ ఇచ్చాడు. బీసీసీఐ అపెక్స్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం గంగూలీ మీడియా తో మాట్లాడాడు.  టీమిండియా తన తదుపరి పింక్ బాల్ టెస్టు ను ఆస్ట్రేలియా పర్యటనలో ఆడనుందని గంగూలీ వెల్లడించాడు.  
 
ఈఏడాది చివర్లో  భారత జట్టు ఆస్ట్రేలియా లో పర్యటించనుంది. టెస్టు సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా ,టీమిండియా మధ్య ఒక డే-నైట్ టెస్టు జరగనుంది. అయితే  2018-19 లో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టు , భారత్ తో పింక్ బాల్ టెస్టు కు ఆసక్తి చూపింది  కానీ అందుకు భారత్ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో అప్పుడు డే-నైట్  టెస్టు సాధ్యం కాలేదు. ఇక గంగూలీ , బీసీసీఐ పగ్గాలు చేపట్టాక డే -నైట్  టెస్టుల పై ప్రత్యేక ద్రుష్టి పెట్టాడు. అందులో భాగంగానే  బంగ్లా తో  డే-నైట్ టెస్టు కు కోహ్లీని ఒప్పించిన గంగూలీ తాజాగా ఆసీస్ తో కూడా  పింక్ బాల్ టెస్టు కు ఒప్పించాడు.
 
అలాగే వచ్చే ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్ , భారత పర్యటన కు  రానుండగా ఇరు జట్ల మధ్య పింక్ బాల్ టెస్టు కు ప్లాన్ చేస్తున్నామని గంగూలీ పేర్కొన్నాడు. ఈమ్యాచ్ ప్రపంచం లోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్ లోని  మొతేరా మైదానంలో జరుగనుంది. 110లక్షల సీటింగ్ కెపాసిటీ కలిగిన మొతేరా స్టేడియాన్ని ఈనెల 24న  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రారంభోత్సవం  చేయనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: