సౌతాఫ్రికా కెప్టెన్  ఫాప్ డుప్లెసిస్ .. టెస్టు, టీ 20 కెప్టెన్సీ బాధ్యతల నుండి వైదొలుగుతున్నట్లు  కొద్దీ సేపటి క్రితం ప్రకటించాడు. ఇప్పటికే రెగ్యులర్ వన్డే కెప్టెన్ గా డికాక్ కొనసాగుతుండడంతో డుప్లెసిస్ మూడు ఫార్మాట్ల నుండి తప్పుకున్నట్లైంది. ఈ సందర్భంగా  మీడియా తో మాట్లాడిన డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సౌతాఫ్రికాకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్ గా వ్యవహరించినందుకు చాలా గర్వ పడుతున్నాను కానీ ఇప్పుడు ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు. నాకు అన్ని విధాలా సహకరించిన నా ఫ్యామిలీకి అలాగే సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు కు కృతజ్ఞతలు.. వెస్టిండీస్ తో  టెస్టు సిరీస్ వరకు అలాగే టీ 20 ప్రపంచ కప్ వరకు కెప్టెన్ గా వుందామనుకున్న కానీ అది సాధ్యం కాలేదు దాంతో ఇక మీదట కేవలం ప్లేయర్ గా మాత్రమే కొనసాగుతాను అలాగే కొత్త కెప్టెన్ డికాక్, కోచ్ మార్క్ బౌచర్,జట్టు సభ్యులకు సహకరిస్తానని డుప్లెసిస్ వెల్లడించాడు. 

 

ఇక డుప్లెసిస్ తప్పుకోవడం తో మూడు ఫార్మాట్ లకు వికెట్ కీపర్ డికాక్ సారథిగా వ్యవహరించనున్నాడు. అయితే గత ప్రపంచ కప్ నుండి  ఇంటా, బయట పేలవ ప్రదర్శన చేస్తూ విమర్శలు ఎదుర్కొంటుంది సౌతాఫ్రికా..  తాజాగా ఇంగ్లాండ్ తో సొంత గడ్డ పై జరిగిన మూడు సిరీస్ లలో ఒక్క దాంట్లో కూడా విజయం సాధించలేకపోయింది.  మరి డికాక్ ఈ టీం ను ఎలా ముందుకు తీసుకెళ్తాడో చూడాలి. త్వరలోనే సౌతాఫ్రికా, సొంత గడ్డపై ఆస్ట్రేలియా తో టీ 20,వన్డే సిరీస్ లలో తలపడనుంది. ఆ తరువాత భారత్, సౌతాఫ్రికా వెళ్లనుంది. అందులో భాగంగా ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగనుంది.  
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: