టీమిండియా స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఫస్ట్ క్లాస్ తోపాటు అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు  శుక్రవారం ప్రకటించాడు. భారత్ తరుపున ఓజా 24 టెస్టులు,18వన్డేలు,6 టీ 20లకు ప్రాతినిధ్యం వహించాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్  టెండూల్కర్ చివరి టెస్టు మ్యాచ్ లో ఓజా చివరగా ఆడడం విశేషం. 2013లో ముంబై లోని వాంఖడే లో వెస్టిండీస్ తో  జరిగిన ఈమ్యాచ్ లో ఓజా మ్యాన్ అఫ్ ది మ్యాచ్ కూడా అందుకున్నాడు. కాగా ఓజా కెరీర్ లో మొహాలీ టెస్టు ప్రత్యేకంగా నిలుస్తుంది. 2010లో ఆస్ట్రేలియా తో జరిగిన ఈమ్యాచ్ లో చివరి వికెట్ కు లక్ష్మణ్ తో కలిసి 11పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి  ఓజా,టీమిండియాకు ఊహించని విజయాన్ని అందించాడు. 
 
ఇక జడేజా రాకముందు వరకు ఎడమ చేతి వాటం  స్పిన్నర్ గా రేస్ లో ముందున్న ఓజా వికెట్లు తీయడం లో తడబడడం తో ఆతరువాత అతని స్థానాన్ని జడేజా భర్తీ చేశాడు. హైదరాబాద్ రంజీ జట్టు తరపున ఫస్ట్ క్లాస్ కెరీర్ ను స్టార్ట్ చేసిన ఓజా ఆతరువాత బెంగాల్ ,బీహార్ జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. చివరగా ఓజా 2018 లో తన సొంత రాష్ట్రం బీహార్ తరుపున చివరి రంజీ మ్యాచ్ ఆడాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: