మన తెలుగమ్మాయి సింధు మరో ఘనత సాధించింది. షట్లర్ పీవీ సింధు ఈఎస్ పీఎన్ ఈ ఏటి మేటి క్రీడాకారిణి’గా ఎంపికైంది. వరుసగా మూడోసారి ఆమెకు ఈ పురస్కారం దక్కడం విశేషం. ఇప్పటికే ప్రపంచ చాంపియన్ తో పాటు అనేక కీర్తి కిరీటాలు సాధించిన తెలుగమ్మాయి సింధుకు ఇది మరో ఘనతగా చెప్పాలి.

 

ఈఎస్‌పీఎన్‌ గత ఏడాది 2019 ఖాతాలో 10 విభాగాల్లో పురస్కారాలు ప్రకటించింది. షటిల్ విభాగంగా మన పీవీ సింధు ఎంపికైంది. ఇక మిగిలిన విభాగాల విషయానికి వస్తే... 2019 డిసెంబర్లో ప్రపంచ ర్యాపిడ్ చెస్ విజేతగా మరో తెలుగమ్మాయి కోనేరు హంపీ నిలిచిన సంగతి తెలిసిందే. ఆమెకు ఈఎస్‌పీఎన్‌ రీఎంట్లీ అవార్డుకు ఎంపికైంది.

 

హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ కు ఈఎస్ పీఎన్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ గుర్తింపు లభించింది. ఇక ప్రపంచ జూనియర్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం, సీనియర్ ఛాంపియన్ షిప్ లో రజతం అందుకున్న రెజ్లర్ దీపక్ పునియా అప్‌కమింగ్‌ స్పోర్ట్స్ పర్సన్‌ గా ఎంపికయ్యాడు. యువ షూటర్ సౌరభ్ చౌదరి స్పోర్ట్స్‌మెన్ ఆఫ్ ద ఇయర్ గా ఎన్నికయ్యాడు.

 

స్ప్రింటర్ ద్యుతీచంద్ ‘డేరింగ్ స్పోర్ట్స్ ఉమన్ గా పురస్కారం గెలిచింది. జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కు ‘ఈ ఏడాది కోచ్ ’ పురస్కారం దక్కింది. 2019 ప్రపంచకప్ లో 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్ టీమ్ విభాగంలో స్వర్ణాలు గెలిచిన మనూ భాకర్ - సౌరభ్ చౌదరీ జంటకు ‘బెస్ట్ టీమ్ అవార్డ్ దక్కింది. బీడబ్ల్యూబీఎఫ్ పారా బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం కైవసం చేసుకున్న మానసి జోషికి హ్యాండీకాప్ కోటాలో అవార్డు వచ్చింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: