వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న మొదటి టెస్టు లో భారత్ తీవ్రంగా నిరాశపరుస్తుంది. ఓవర్ నైట్ స్కోరు 122/5 తో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన భారత్.. మొదటి ఇన్నింగ్స్ లో 165పరుగులకు ఆల్ ఔటయింది. ఆదుకుంటాడనుకున్న రిషబ్ పంత్(19) ఎప్పటిలాగే తనకు అలవాటైన రీతిలో వికెట్ పారేసుకోగా.. కుదుర్కున్నట్లు కనిపించిన రహానే (46)కూడా ఎక్కువ సేపు క్రీజ్ లో నిలువలేకపోయాడు. చివర్లో షమి(21) పుణ్యమాని భారత్ ఆ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది. టీమిండియా ఇన్నింగ్స్ లో రహానే ,మయాంక్ అగర్వాల్ తర్వాత అత్యధిక పరుగులు చేసింది షమి నే. న్యూజిలాండ్ బౌలర్ల లో అరంగేట్రం ఆటగాడు జమైసన్ 4, సౌథీ 4 వికెట్లు పడగొట్టగా బౌల్ట్ ఓ వికెట్ తీశాడు. 
 
ఇక బ్యాటింగ్ లో విఫలమైన భారత్ బౌలింగ్ లో కూడా నిరాశపరుస్తుంది. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లు , భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ సునాయాసంగా పరుగులు రాబడుతున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 51ఓవర్ల లో 2వికెట్ల నష్టానికి 166పరుగులు చేసింది.కెప్టెన్ విలియమ్సన్ (74*), టేలర్(44*) క్రీజ్ లో వున్నారు. ఆ రెండు వికెట్లను కూడా ఇశాంత్ శర్మ నే తీయగలిగాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: