ఏ క్రికెటర్ కి అయినా ఎవరు ఫేవరెట్‌ ఉంటారు ? ఎవరు ఆదర్శంగా ఉంటారు? మాములుగా అయితే ఏ క్రికెటర్ కి అయినా సరే తన దేశంలో గొప్ప క్రికెటర్ ఈ ఫేవరెట్‌.. పక్క దేశంలో క్రికెటర్స్ ఫేవరెట్‌ అయినా సరే బయటకు చెప్పారు.. కానీ ఆసీస్ స్టార్ క్రికెటర్ ఆస్ట‌న్ అగ‌ర్‌ మాత్రం తనకు జడేజా అంటే ఇష్టం అని.. ప్రపంచ క్రికెట్ లో అతనే జడేజానే ఫేవరెట్‌ ప్లేయర్‌ అని చెప్పుకొచ్చారు. 

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిన్న శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 107 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన సంగతి విధితమే.. హ్యాట్రిక్‌తో సహా మొత్తం 5 వికెట్లు తీసిన స్పిన్న‌ర్ ఆస్ట‌న్ అగ‌ర్‌ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఆస్ట‌న్ అగ‌ర్‌ మాట్లాడుతూ తన ఫేవరేట్ క్రికెటర్ గురించి చెప్పుకొచ్చాడు. 

 

ఆస్ట‌న్ అగ‌ర్‌ మీడియాతో మాట్లాడుతూ... ''ప్రపంచ క్రికెట్‌లో నా ఫేవరెట్‌ ప్లేయర్‌ రవీంద్ర జడేజా. ఫీల్డ్‌లో జడేజా చేసిన ప్రదర్శన నన్ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. నాకు కూడా జడేజాలా రాణించాలనుంది. జడేజా ఒక రాక్‌స్టార్‌. ఫీల్డింగ్‌లో చురుకుదనం, బంతిని స్పిన్‌ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇక బ్యాటింగ్‌లో కూడా అద్భుతంగా ఆడుతాడు. నాలో ఆత్మవిశ్వాగడానికి భారత పర్యటనతో పాటు జడేజా కూడా కారణం'' అని పేర్కొన్నాడు. దీంతో ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మన క్రికెటర్స్ అంటే ఒక్క మన దేశ ప్రజలకే కాదు పక్క దేశ క్రికెటర్లకు కూడా ఇష్టం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: