సర్ ..డాన్ బ్రాడ్‌మెన్.. క్రికెట్ ప్రపంచంలో లెజండ్. ఎవరికీ అందని పరుగుల సగటుతో చరిత్రను లిఖించారు బ్రాడ్‌మెన్. బ్రాడ్ మెన్ క్రికెట్ అంటే .. ఫ్యాన్స్‌కు మానియా. బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్లపై క్రికెట్ లెజండ్ ఆట చూసి..ఇప్పటికీ ఫ్యాన్స్ ఆనందిస్తుంటారు. అలాంటిది ఆయన ఆడిన గేమ్‌కు సంబంధించిన రంగుల ఫుటేజ్ వెలుగుచూడడం.. ఫ్యాన్స్‌లో సంతోషం నింపింది.

 

డాన్‌.. బ్యాట్ పట్టాడంటే ప్రత్యర్థిబౌలర్లకు చుక్కలే.. క్లాసిక్‌ షాట్లతో అదరగొట్టే డాన్ బ్రాడ్‌మెన్ గురించి.. నాటి తరం బౌలర్ల ప్రశంసలివి. ఎంతో స్టయిలిష్‌గా బ్యాటింగ్ చేసే ఈ క్రికెట్‌ దిగ్గజం.. క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో 99.94 సగటుతో పరుగుల చేశారు. ఇప్పటి క్రికెట్ దిగ్గజాలకు స్ఫూర్తిగా నిలిచారు.

 

ఇన్నాళ్ల తర్వాత బ్రాడ్‌మాన్ రంగుల ఫుటేజ్ బయటపడింది. ఇప్పుడంటే అభిమానులు HD, 4K, 8K వెర్షన్‌లలో స్ర్కీన్  పై క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నారు. కానీ, ఆయన కాలంలో అలా కాదు. అన్నీ బ్లాక్‌ అండ్ వైట్ రంగుల్లోనే ఉండేవి. కాని దాదాపు 71 ఏళ్ల తర్వాత బ్రాడ్‌మన్‌ బ్యాటింగ్‌ చేస్తున్న రంగుల వీడియో ఫుటేజ్‌ బయటకొచ్చింది.

 

సిడ్నీ క్రికెట్‌ మైదానంలో బ్రాడ్‌మన్‌ ఆడిన చివరి దేశవాళీ మ్యాచ్‌గా దీనిని భావిస్తున్నారు. 1949, ఫిబ్రవరి 26న AF కిపాక్స్‌, WA ఓల్డ్‌ఫీల్డ్‌ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. 16 MM కలర్ ఫుటేజ్‌ను జార్జ్‌ హబ్స్‌ షూట్‌ చేశారని తెలుస్తోంది. రెండో ప్రపంచకప్‌ యుద్ధంలో ఆయన సమాచార శాఖకు కెమెరామ్యాన్‌గా పనిచేశారు. అతడి కుమారుడే ఇప్పుడీ ఫుటేజ్‌ను బయట పెట్టారని తెలుస్తోంది.

 

 ఫైన్‌లెగ్‌లోకి ఆయన బంతిని తరలించి పరుగులు తీశారు. టెస్ట్‌ క్రికెట్‌ రికార్డుల మాట ఎత్తగానే బ్రాడ్‌మాన్ ఆటను ఈ తరం క్రికెట్ అభిమానులు గుర్తుకు తెచ్చుకుంటారు. అలాంటి దిగ్గజ ఆటగాడు అడుతున్నప్పటి రంగుల వీడియో ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ ఖుషి చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: