టీం ఇండియా కివీస్ పర్యటనలో మరో సీరీస్ కోల్పోయింది. అత్యుత్తమ టెస్ట్ జట్టుగా గుర్తింపు పొందిన కోహ్లీ సేన న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో పది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇప్పటి వరకు భారత్ లో తిరుగులేని విజయాలు సాధించిన కోహ్లీ సేన విదేశాల్లో మాత్రం చతికిలపడుతుంది అనే విమర్శను నిజం చేసింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనలలో వరుస ఓటములు ఎదుర్కొన్న కోహ్లీ సేన. 

 

న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో కూడా ఓటమి పాలైంది. పది వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలై రెండు టెస్ట్ ల సీరీస్ లో ఒక టెస్ట్ ని కోల్పోయింది. రెండో టెస్ట్ డ్రా అయినా లేదా ఓడిపోయినా సీరీస్ పోతుంది. సమం చేసినా సీరీస్ దక్కదు. బ్యాటింగ్ నుంచి బౌలింగ్ వరకు అన్ని విభాగాల్లో టీం ఇండియా ఓటమి పాలైంది. ఏ విధంగా చూసినా సరే ప్రత్యర్ధి మీద ఆధిపత్య౦ ప్రదర్శించలేకపోయింది. 

 

ముఖ్యంగా బ్యాటింగ్ విభాగం మాత్రం ఘోరంగా విఫలమైంది. ఒక్క మయాంక్ అగర్వాల్, అజింక్యా రహానే మినహా ఎవరూ కూడా ప్రభావం చూపించలేదు. దీనితో ఓటమి ఖాయమైంది. మొదటి ఇన్నింగ్స్ లో పేలవ ఆట తీరుతో జట్టు ఓటమి ఎదుర్కొంది. రెండో టెస్ట్ లో కూడా ఇలాగే ఆడితే సీరీస్ ఓటమి ఖాయం. ఏది ఎలా ఉన్నా మన వాళ్ళు స్వదేశంలో మాత్రమే పులులు అనే విమర్శలను నిజం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: