సౌతాఫ్రికా క్రికెట్ టీంకు ఆదివారం బాగా కలిసొచ్చింది. అటు పురుషుల జట్టు అలాగే మహిళల జట్టు తాము ఆడిన మ్యాచ్ ల్లో విజయం సాధించాయి. అందులో భాగంగా మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో నిన్న ఆస్ట్రేలియా తో జరిగిన రెండో టీ 20 లో సౌతాఫ్రికా పురుషుల జట్టు 12పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈమ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20ఓవర్లలో  4వికెట్ల నష్టానికి 158పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 20ఓవర్ల లో 6వికెట్లు కోల్పోయి 146పరుగులకే పరిమితమైంది. 47బంతుల్లో 5ఫోర్లు ,4 సిక్సర్ల తో 70రన్స్ చేసి అదరగొట్టిన సౌతాఫ్రికా కెప్టెన్ డికాక్ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈవిజయంతో ప్రొటీస్ జట్టు  సిరీస్ ను 1-1 తో సమం చేసి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. 
 
ఇక మహిళల టీ 20 ప్రపంచ కప్ లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికా ఉమెన్ టీం , ఇంగ్లాండ్ ఉమెన్ టీం పై  6వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20ఓవర్ల లో 8వికెట్ల నష్టానికి 123పరుగులు మాత్రమే చేసింది. అనంతరం 19.4 ఓవర్ల లో 4వికెట్లు కోల్పోయి సౌతాఫ్రికా లక్ష్యాన్ని ఛేదించింది. అలా సౌతాఫ్రికా నిన్న రెండు టీ 20 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: