పరుగుల యంత్రం... రికార్డుల రారాజు... అగ్రెసివ్ క్యాప్టెన్... ఇలా చెప్పుకుంటూ పోతే భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే. జట్టులోకి వచ్చినప్పటి నుంచి తనదైన అద్భుత ప్రదర్శన చేస్తూ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత తనదైన ఆట ప్రదర్శన తో ఏకంగా జట్టు సారథ్య బాధ్యతలను చేపట్టాడు విరాట్ కోహ్లీ. ఇక తన సారధ్యంలో భారత జట్టును మునుపెన్నడూ లేని విధంగా ఎంతో పటిష్టంగా తయారు చేసీ... ప్రస్తుతం ప్రత్యర్థి జట్లు  అన్నింటినీ బెంబేలెత్తిస్తున్నాడు. ముఖ్యంగా భారత జట్టులో పేస్ దళం  మునుపెన్నడూ లేని విధంగా అత్యంత పటిష్టంగా మారిపోయింది. 

 

 

 అయితే విరాట్ కోహ్లీ ఓ వైపు జట్టు బాధ్యతలను భుజాలపై వేసుకొని విజయవంతంగా ముందుకు నడిపిస్తూనే మరోవైపు... జట్టులో కీలక బ్యాట్స్మెన్గా... పరుగుల వరద పారిస్తూ  జట్టును విజయతీరాలకు వైపు నడిపిస్తున్నాడు విరాట్ కోహ్లీ. ఎలాంటి ఫార్మాట్లోనూ అయినా తనదైన అద్భుత ప్రదర్శన చేస్తూ జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. తన పరుగుల వేటను  కొనసాగిస్తూ ఎన్నో రికార్డులను సైతం కొల్లగొట్టాడు విరాట్ కోహ్లీ. కానీ గత కొంతకాలంగా విరాట్ కోహ్లీ ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతున్నాడు అన్నది అందరికీ తెలిసిన విషయమే. న్యూజిలాండ్లో జరిగిన వన్డే సిరీస్ సహా తాజాగా జరుగుతున్న టెస్టు సిరీస్లో కూడా విరాట్ కోహ్లీ పేలవ  ప్రదర్శన చేస్తున్నాడు. 

 

 

 ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ పై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే తనపై వస్తున్న విమర్శలపై టీమిండియా సారథి స్పందిస్తూ ఘాటుగానే బదులిచ్చాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్లో అతను బాగా ఆడుతున్నట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. ఒక్క మ్యాచ్ లో ఆడనంత  మాత్రాన తన బ్యాటింగ్ విధానం మారిపోయినట్లు కాదు అంటూ తెలిపారు విరాట్ కోహ్లీ. దీర్ఘకాలంగా తీరిక లేకుండా ఆడడం వల్ల కొన్నిసార్లు రాణించలేం అంటూ చెప్పుకొచ్చాడు. తాను ఒక ఇన్నింగ్స్ లో అద్భుత ప్రదర్శన చేస్తే బయట పరిస్థితులు మారిపోతాయి అంటూ వ్యాఖ్యానించిన విరాట్ కోహ్లీ... తాను అలా ఆలోచించే వాడిని కాదు అంటూ తెలిపారు. బయట ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తే నేను కూడా వారి మధ్య ఉండేవాడినని ఇక్కడి వరకూ వచ్చేవాడిని కాదు అంటూ ఘాటుగా బదులిచ్చారు విరాట్ కోహ్లీ.

మరింత సమాచారం తెలుసుకోండి: