గత కొంత కాలంగా వరస టెస్టు సిరీస్ లకు ఎంపికవుతున్నా ఇంతవరకు ఒక్క మ్యాచ్ లో కూడా ఆడే అవకాశం దక్కలేదు టీమిండియా యువ ఓపెనర్ శుభమాన్ గిల్ కు..కనీసం న్యూజిలాండ్ తో జరుగనున్నరెండో టెస్టులోనైనా అరంగేట్రం చేసే ఛాన్స్ వస్తుందనుకుంటే అది కూడా లేదని తేలిపోయింది. ఈటెస్టు కు ముందు నిన్న ఓపెనర్ పృథ్వీ షా పాదం గాయంతో ప్రాక్టీస్ కు దూరమయ్యాడు దాంతో ఒకవేళ పృథ్వీ ఫిట్ గా లేకుంటే గిల్ ఎంట్రీ కన్ ఫర్మ్ అనుకున్నారు కానీ ఆ గాయం నుండి పృథ్వీ పూర్తి గా కోలుకొని మళ్ళీ ప్రాక్టీస్ లోకి దిగాడు.
 
తాజాగా కోచ్ రవిశాస్త్రి మీడియాతో మాట్లాడుతూ..పృథ్వీ షా 100శాతం ఫిట్ గా వున్నాడు రెండో టెస్టు లో అతను ఆడతాడని క్లారిటీ ఇచ్చాడు. దాంతో టెస్టుల్లో ఎంట్రీ  కోసం గిల్ మరికొంత కాలం ఎదురుచూడక తప్పేలాలేదు. అయితే వన్డే సిరీస్ లో విఫలమై తాజాగా జరిగిన మొదటి టెస్టు లోనూ చెత్త ప్రదర్శన చేసిన పృథ్వీ షా ను రెండో టెస్టుకు కూడా కొనసాగించడం పై బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక అలాగే జడేజా , అశ్విన్ లలో రెండో టెస్టు కు ఎవరిని తీసుకోవాలో  రేపు ఉదయం నిర్ణయిస్తామని రవిశాస్త్రి వెల్లడించాడు. 
 
వీరితోపాటు పంత్ ,సాహా లలో ఎవరు తుది జట్టులో వుంటారోనని ఆసక్తిగా మారింది. కోహ్లీ మాత్రం పంత్ వైపే మొగ్గు చూపిస్తునట్లు తెలుస్తుంది. మరోవైపు ఫాస్ట్ బౌలర్ నీల్ వాగ్నెర్ రాక తో న్యూజిలాండ్ బౌలింగ్ విభాగం దుర్బేధ్యంగా కన్పిస్తుంది. మరి రెండో టెస్టు ను గెలుచుకొని టీమిండియా సిరీస్ ను డ్రా చేసుకుంటుందో లేక ఓటమి తో వైట్ వాష్ చేయించుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: