టెస్ట్ క్రికెట్ అంటే వికెట్ పడకుండా కాపాడుకోవాలి. వికెట్ పడితే మ్యాచ్ పోయినట్టే. ప్రత్యర్ధికి తన ఓపికతో బ్యాట్స్మెన్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. చాలా ఓపికగా ఆడాలి ఆటగాడు. ఇదే సమయంలో స్ట్రైక్ రొటేట్ చేయడం అనేది చాలా ముఖ్యం. అలా కాకుండా ఆడితే మాత్రం విసుగు పుడుతుంది. విసుగు అని కాదు గాని, జట్టు ఓటమికి కారణం అవుతుంది. ఆత్మరక్షణ లో ఆడితే ఇబ్బంది పడటం ఖాయం. 

 

టీం ఇండియా నయావాల్ పుజారా ఇప్పుడు ఆత్మరక్షణ లో ఆడుతున్నాడు. స్ట్రైక్ రేట్ చూస్తే 30 లోపే ఉంటుంది. జిడ్డు కే జిడ్డు చూపిస్తున్నాడు. మొన్న 80 బంతులు ఆడి 11 పరుగులు చేసాడు. 30 బంతుల వరకు ఏ పరుగు చేయలేదు పుజారా. దీనితో ఇప్పుడు అతని ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి. పుజారా ఆట ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని అంటున్నారు. అటు కోహ్లీ కూడా ఈ ఆట తీరుపై మండిపడుతున్నాడు. 

 

ఇదేం ఆట రా బాబు అంటూ ఫాన్స్ కూడా చిరాకు పడుతున్నారు. మూడో స్థానంలో వచ్చే ఆటగాడు అలా ఆడితే ఆ ప్రభావం జట్టుపై కచ్చితంగా పడుతుంది. మంచి బంతి కోసం ఎదురు చూసి ఒక సింగల్ తీస్తున్నాడు. దీనితో అతని ఆట అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇంకా ఇలాగే ఆడితే జట్టు ఓటమి ఖాయమని, అతని దెబ్బ మిడిల్ ఆర్డర్ పై భారీగా పడుతుంది అంటున్నారు. అంత జిడ్డు ఆట ఎంత మాత్రం భావ్యం కాదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: