టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రతిభ గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్ గా కీర్తించబడుతున్న కోహ్లీ ఫార్మేట్ ఏదైనా తన బ్యాట్ తో ప్రత్యర్థి బౌలర్లకు సింహస్వప్నంగా మారాడు. అయితే కొత్త సంవత్సరం కోహ్లీకి వ్యక్తిగతంగా ఏమాత్రం కలిసిరాలేదు. న్యూజిలాండ్ పర్యటన తో కొత్త సంవత్సరం ప్రారంభించిన టీం ఇండియా టీ20 సీరీస్ లో లో ఘన విజయం సాధించినా వన్డే సిరీస్ లో మాత్రం క్లీన్ స్వీప్ కి గురైంది. ఇక గత వారం జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో అయితే ఘోరపరాభవం చవిచూసింది. సిరీస్ లో కోహ్లీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన అసలు చేయలేదు.

 

IHG

 

ఇకపోతే మొన్న వన్డే సిరీస్ ఓడిపోయినప్పుడు మరియు ఇప్పుడు మొదటి టెస్టు ఓడిపోయినప్పుడు రెండు సార్లూ కోహ్లీ మాట్లాడుతూ జట్టు ఎక్కువ క్రికెట్ ఆడుతోందని.. మరియు వారి పరాజయానికి అలసిపోవడం కూడా ఒక కారణమని అనడం గమనార్హం. కోహ్లీ అన్న మాటల పై భారత్ కు మొట్ట మొదటి ప్రపంచ కప్ అందించిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసలు దేశం కోసం ఆడేటప్పుడు అలసట ఎందుకు వస్తుంది అన్నది కపిల్ దేవ్ ప్రశ్న.

 

IHG

 

అలాగే కోహ్లీ అన్న మాటలకు సమాధానంగా కపిల్ మాట్లాడుతూ అంత ఎక్కువ క్రికెట్ ఆడేసి కొహ్లీ అలసిపోయి ఉంటే కోహ్లీ ఐపీఎల్ మానుకోవచ్చు కదా అని సలహా ఇచ్చాడు. ప్రతి ఏటా అకౌంట్లో కోటానుకోట్ల రూపాయలు కుమ్మరించే ఐపీఎల్ ను మానుకొని ఒకటిన్న నెల రోజులు విశ్రాంతి తీసుకో లేరు కానీ దేశం కోసం ఆడుతున్నప్పుడు మాత్రం మీకు అలసట వస్తుందా అని కపిల్ దేవ్ ప్రశ్నించాడు. టి20 వరల్డ్ కప్ సంవత్సరమే ఉంది కాబట్టి కోహ్లీని ఐపీఎల్ మానుకోవడం పెద్ద పొరపాటే అవుతుంది అని నెటిజన్లు అంటున్నారు. అయితే కపిల్ అన్న మాటల్లో కూడా తప్పేమీ లేదు కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: