సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా ఇటీవల జరిగిన మూడు టీ 20ల సిరీస్ ను 2-1 తో గెలుచుకున్న అస్ట్రేలియా కు తొలి వన్డే లో చుక్కెదురైయింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా శనివారం జరిగిన మొదటి వన్డే లో ఆసీస్ పై 74 పరుగులతో సౌతాఫ్రికా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్ల లో 7వికెట్ల నష్టానికి 291పరుగులు చేసింది. కెప్టెన్ డికాక్ విఫలమైనా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లు క్లాసెన్ (123*),మిల్లర్ (64) రాణించడంతో దక్షిణాఫ్రికా మంచి స్కోరు చేయగలింది.  అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ 45.1 ఓవర్ల లో 217పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయ్యింది. 
 
ఓపెనర్లు వార్నర్, ఫించ్ విఫలంకాగా స్మిత్(76), లబుషెన్(41) కలిసి ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. అయితే 133పరుగుల వద్ద లబుషెన్ అవుట్ కాగా ఆతరువాత కాసేపటికే మార్ష్, స్మిత్ కూడా పెవిలియన్ కు చేరుకున్నారు. ఇక అక్కడి నుండి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి ఆసీస్ ఓటమిని చవిచూసింది. సౌతాఫ్రికా బౌలర్ల లో ఎంగిడి 3, నోర్జే ,శంసి 2 వికెట్లు తీయగా ఫెహ్లుక్వయో ,మహారాజ్ చెరో వికెట్ పడగొట్టారు. సెంచరీ హీరో క్లాసెన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. కాగా వన్డేల్లో అతనికిదే తొలి సెంచరీ కావడం విశేషం. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే బుధవారం జరుగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: