న్యూజిలాండ్ - భారత్ ల మధ్య జరిగిన రెండో టెస్ట్ రెండున్నర రోజుల్లోనే ముగిసింది. ఈ టెస్టులో 7వికెట్ల తేడాతో కివీస్ ఘనవిజయం సాధించి రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఓవర్నైట్ స్కోర్ 90/6తో మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించిన భారత్ రెండో ఇన్నింగ్స్ లో124 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది..  మ్యాచ్ ప్రారంభమైన మూడో ఓవర్ కే హనుమ విహారి అవుట్ కాగా ఆతరువాతి ఓవర్ లో పంత్ వెనుదిరిగాడు. ఆకాసేపటికే షమి, బుమ్రా కూడా అవుట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 16పరుగులతో అజేయంగా నిలిచాడు. కివీస్ బౌలర్ల లో బౌల్ట్ 4,సౌథీ 3 వికెట్లు తీయగా గ్రాండ్ హోమ్ ,వాగ్నెర్ చెరో వికెట్ తీశారు. 
 
అనంతరం 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కు ఓపెనర్లు  టామ్ లేథమ్ , బ్లండెల్ శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు హాఫ్ సెంచరీల తో రాణించడం తో కివీస్ విజయం ఖరారైయింది. 36ఓవర్ల లో 3వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ లక్ష్యాన్ని చేరుకుంది. బుమ్రా రెండు వికెట్లు తీయగా ఉమేష్ ఓ వికెట్ పడగొట్టాడు.
 
ఇక ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో మొదటి సారి సిరీస్ పరాజయాన్ని చవిచూసింది టీమిండియా. ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో 360పాయింట్ల తో భారత్ మొదటి స్థానం లో ఉండగా 296 పాయింట్ల తో ఆస్ట్రేలియా రెండో స్థానం లో వుంది. తాజాగా ఈ సిరీస్ ను గెలవడం ద్వారా న్యూజిలాండ్ 120పాయింట్ల ను రాబట్టుకొని మొత్తం 180 పాయింట్ల తో మూడో  స్థానం లో కొనసాగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: