భారత్ జట్టు ఎనిమిదేళ్ల అనంతరం ఆతిధ్య  జట్టు చేతిలో చిత్తయింది .   న్యూజిలాండ్ పర్యటన లో భాగంగా వన్డే , టెస్టు సిరీస్ లలో కోహ్లీసేన వైట్ వాష్ అయింది . ధోని నుంచి సారధ్య  బాధ్యతలు స్వీకరించిన  తరువాత కోహ్లీ  ఇంతటి ఘోర పరాజయాన్ని  చవి చూసిన దాఖలాలు లేవు . ఈ సిరీస్ లో సారథిగానే కాకుండా కోహ్లీ బ్యాట్స్ మెన్ గా కూడా పూర్తిగా విఫలమయ్యాడు . దానికి తోడు  బౌలర్లు , బ్యాట్స్ మెన్లు ఆశించిన స్థాయి లో రాణించలేక చతికిలపడడం తో ఏ దశలోనూ ఈ సిరీస్ లో భారత్ జట్టు పుంజుకునే అవకాశాలు కన్పించలేదు .

 

  2012 లో    ఆస్ట్రేలియా జట్టు చేతిలో టీమిండియా వైట్ వాష్ కాగా , ఎనిమిదేళ్ల అనంతరం అంతటి పరాభవాన్ని భారత్ జట్టు మరోసారి  మూటగట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది . న్యూజిలాండ్ లో సుదీర్ఘ టి - 20 , వన్డే , టెస్టు సిరీస్ ఆడేందుకు  అడుగిడిన భారత్ జట్టు , టి -20 సిరీస్ లో దూకుడు ప్రదర్శించి 5  - 0  తేడాతో ఘన విజయం సాధించింది . ఇక వన్డే లోను భారత్ జట్టు అదే  దూకుడు ప్రదర్శించడం ఖాయమని భావించిన  అభిమానులకు నిరాశే మిగిలింది . న్యూజిలాండ్ చేతిలో భారత్ జట్టు అనూహ్యంగా 3 - 0 తేడాతో ఓటమిపాలయింది .

 

ఇక టెస్టు సిరీస్ లోను భారత్ జట్టు పేలవ ఆటతీరు తో  చిత్తయింది . అయితే  టెస్టు సిరీస్ లో ఓటమి పాలయిన  భారత్ జట్టు అగ్ర స్థానాన్ని కోల్పోకుండా నిలబెట్టుకుంది . ఇక ఈ సిరీస్ విజయం తో టెస్టు ర్యాంకింగ్స్ లో న్యూజిలాండ్ మూడవ స్థానానికి ఎగబాకింది . 

మరింత సమాచారం తెలుసుకోండి: