13 ఏళ్ళ తరువాత రంజీ ట్రోఫీ ఫైనల్లో అడుగు పెట్టి బెంగాల్ జట్టు చరిత్ర సృష్టించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కర్ణాటక తో జరిగిన రెండవ సెమిస్ లో బెంగాల్ 174 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.  ఈమ్యాచ్ లో బెంగాల్ మొదటి ఇన్నింగ్స్ లో 312 పరుగులు చేయగా కర్ణాటక 122 రన్స్ కు ఆల్ ఔటైంది. ఆతరువాత రెండో ఇన్నింగ్స్ లో బెంగాల్ 161పరుగులకే ఆల్ ఔటైనా కర్ణాటకకు భారీ టార్గెట్ నే నిర్దేశించింది. 
 
అనంతరం లక్ష్య ఛేదనలో కర్ణాటక 177 పరుగులకే కుప్పకూలి పరాజయాన్ని చవిచూసింది. కర్ణాటక తరుపున టీమిండియా క్యాప్డ్ ప్లేయర్స్ కేఎల్ రాహుల్, మనీష్ పాండే, కరుణ్ నాయర్ బరిలో నిలిచినా తమ జట్టును ఫైనల్ కు తీసుకురాలేకపోయారు. ఈముగ్గురు రెండు ఇన్నింగ్స్ ల్లో దారుణంగా విఫలమయ్యారు. ఇక  రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 190 పరుగులు చేసిన బెంగాల్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ మజుందార్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.  
 
ప్రస్తుతం గుజరాత్ ,సౌరాష్ట్ర ల మధ్య మొదటి సెమి ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో సౌరాష్ట్ర మొదటి ఇన్నింగ్స్ లో 304పరుగులు చేయగా గుజరాత్ 252 పరుగులకు ఆల్ ఔటై అయ్యింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన సారాష్ట్ర నాలుగో రోజు లంచ్ సమయానికి 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. దాంతో ఇప్పటివరకు ఓవరాల్ గా సౌరాష్ట్ర 206పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇందులో గెలిచిన జట్టుతో బెంగాల్ ఫైనల్ లో తలపడనుంది. మార్చి13 నుండి ఈ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: