టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భారం దించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ప్రస్తుతం టీం ఇండియా న్యూజిలాండ్ పర్యటన నుంచి భారత్ కి తిరిగి వస్తుంది. ఈ పర్యటనలో ఒక టి20 సీరీస్ గెలిచిన టీం ఇండియా వన్డే, టెస్ట్ సీరీస్ ని దారుణంగా కోల్పోయింది. పుంజుకున్న కివీస్ టీం ఇండియాకు చుక్కలు చూపించింది అని పరిశీలకులు కూడా అంటున్నారు. 

 

ఈ నేపధ్యంలోనే కోహ్లే ఆట తీరు కూడా ఇప్పుడు చర్చకు వస్తుంది. వన్డే టెస్ట్ సీరీస్ టీం ఇండియా ఓడిపోవడానికి ప్రధాన కారణం కోహ్లీ ఆట తీరు అనే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. దీనితో కోహ్లీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. టెస్ట్, వన్డే కెప్టెన్ బాధ్యతలు మాత్రమే నిర్వహించాలని, టి20 నుంచి తప్పుకోవాలని కోహ్లి భావిస్తున్నాడట. ఐపిఎల్ తర్వాత అతను ఈ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని టాక్. 

 

దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. కోహ్లి కూడా ఈ విషయంలో ఇప్పటికే బోర్డ్ తో కూడా చర్చలు జరిపాడని సమాచారం. బోర్డ్ కూడా దీనికి అంగీకారం తెలిపింది అంటున్నారు. ఇటీవల తమ మీద ఒత్తిడి ఎక్కువ అవుతుందని, తాము అలసిపోతున్నాని కోహ్లీ వ్యాఖ్యానించాడు. దీనితో అతను తప్పుకోవాలని పలువురు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: