భారత్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ఆకాశమే హద్దుగా చెలరేగిపోతే , మరొక భారత్  బ్యాట్స్ మెన్ మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు . వీరిద్దరూ భారత్ జట్టులో పునరాగమనం కోసం ఎదురు చూస్తున్నవారే కావడం విశేషం .  డివై పాటిల్ టీ - 20  క్రికెట్ టోర్నీ లో భాగంగా సీ ఏ జీ (కాగ్ ) జట్టుతో జరిగిన మ్యాచ్ లో  రిలయన్స్ 1 తరుపున బరిలోకి దిగిన హార్దిక్ కేవలం 37 బంతుల్లోనే సెంచరీ బాది, జట్టు భారీ స్కోరు కు పునాది వేశాడు .

 

 ఇక , ఇన్నింగ్స్ 15 ఓవర్ లో  జీవరాజన్ బౌలింగ్ లో పాండ్య , మూడు సిక్సర్లు , రెండు ఫోర్లతో ఏకంగా 26  పరుగులు  పిండుకున్నాడు .    కేవలం 39 బంతుల్లో  ఏడు సిక్సర్లు , పది బౌండరీల సాయం తో పాండ్య 105 పరుగులు సాధించగా, రిలయన్స్ 1 జట్టు నిర్ణిత 20  ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 252 పరుగుల భారీ స్కోరు సాధించింది . ఇక  సీ ఏ జీ (కాగ్ ) తరుపున బరిలోకి దిగిన శిఖర్ ధావన్ పరుగులేమి చేయకుండానే వెనుతిరిగి నిరాశపరిచాడు . వీరిద్దరూ జాతీయ  జట్టులోకి పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నారు . పాండ్య వెన్ను నొప్పి కారణంగా గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ  క్రికెట్ కు దూరమైన విషయం తెల్సిందే .

 

అయితే గాయం నుంచి కోలుకున్న తరువాత పాండ్య తన మునపటి ఫామ్ ను అందిపుచ్చుకోవంతో  అటు జట్టు యాజమాన్యం  , ఇటు అభిమానుల ఆనంద పడుతున్నారు . ఇక ఐపీల్ టోర్నీలో ముంబయి జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్న పాండ్య ఈ సీజన్ లో ఇదే తరహా విధ్వంస ఇన్నింగ్స్ కొనసాగించాలని అభిమానులు , ఆ జట్టు మేనేజ్ మెంట్ కోరుకుంటున్నాయి .      

మరింత సమాచారం తెలుసుకోండి: