ఇటీవల సొంత గడ్డ పై భారత్ తో జరిగిన వన్డే , టెస్టు సిరీస్ లను క్లీన్ స్వీప్ చేసి ఫుల్ జోష్ లో వుంది న్యూజిలాండ్. ఈపర్యటనలో మొదటగా టీ 20 సిరీస్ లో  భారత్ చేతిలో వైట్ వాష్ కు గురి కాగా ఆతరువాత ఏకంగా రెండు సిరీస్ లను క్లీన్ స్వీప్ చేసి కివీస్ ప్రతీకారం తీర్చుకుంది. ఇక ప్రస్తుతం న్యూజిలాండ్,ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లేందుకు సిద్దమవుతుంది. అందులో భాగంగా ఆసీస్ తో కివీస్ మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో తలపడనుంది. తాజాగా ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది.  
 
భారత్ తో మూడు సిరీస్ లకు దూరమైన ఫెర్గుసన్ ,హెన్రీ, తోపాటు బౌల్ట్ (టీ 20, వన్డే) ఆసీస్ తో సిరీస్ కు జట్టులో చేరారు. వీరితో పాటు ఇండియా తో వన్డే, టెస్టు సిరీస్ లలో ఆకట్టుకున్న ఫాస్ట్ బౌలర్ జమైసన్ కూడా ఎంపికైయ్యాడు. దాంతో న్యూజిలాండ్ అన్ని విభాగాల్లో దుర్బేధ్యంగా కనిపిస్తుంది. మార్చి13న ఈ వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ప్రస్తుతం ఆస్ట్రేలియా ,సౌతాఫ్రికా పర్యటనలో వుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఆసీస్, ఆతిథ్య జట్టుతో మూడు వన్డేల సిరీస్ లో తలపడుతుంది. ఇందులో మొదటి మ్యాచ్ లో కంగారులు ఓటమిని చవిచూడగా రెండో మ్యాచ్ రేపు జరుగనుంది. 
 
ఆసీస్ తో వన్డే సిరీస్ కు న్యూజిలాండ్ జట్టు : 
గప్తిల్,టామ్ బ్లండెల్, విలియమ్సన్(కెప్టెన్),టేలర్ ,లేథమ్ (కీపర్) ,గ్రాండ్ హోమ్, నికోల్స్, సౌథీ, బౌల్ట్,జమైసన్, ఫెర్గుసన్,హెన్రీ,నీశమ్, సాన్ట్నర్, సోడి

మరింత సమాచారం తెలుసుకోండి: