మంగళవారం బంగ్లాదేశ్, జింబాబ్వే  జట్ల మధ్య జరిగిన రెండో వన్డే లో బంగ్లా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఓడిపోయినా కూడా  జింబాబ్వే ప్రదర్శన ఆకట్టుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్ల లో 8వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (158) సెంచరీ తో చెలరేగగా ముష్ఫికర్ రహీం 55) హాఫ్ సెంచరీ తో రాణించాడు. అనంతరం లక్ష్య ఛేదన లోజింబాబ్వే 50 ఓవర్ల లో 8కోల్పోయి 318 పరుగులు చేసి ఓటమిని చవిచూసింది. చివరి ఓవర్ లో విజయానికి 20 పరుగులు చేయాల్సి ఉండగా జింబాబ్వే 15పరుగులు మాత్రమే చేయగలిగింది. 
 
అయితే  41ఓవర్ కు 225/7 తో వున్న దశలో టైలండర్లు అక్కడి దాక తీసుకరావడం గొప్ప విషయమే. 8,9 స్థానాల్లో వచ్చిన ముటుంబాడ్జీ(34) , టిరిపానో(55) బంగ్లా బౌలర్ల కు చుక్కలు చూపించారు. వీరిద్దరూ ఫోర్లు , సిక్సర్లతో విరుచుకపడ్డారు. అయితే చివరి ఓవర్ రెండో బంతికి  ముటుంబాడ్జీ అవుట్ కాగా ఆతరువాతి రెండు బంతులను సిక్సర్లు గా తరిలించిన టిరిపానో 5వ బంతిని డాట్ చేశాడు. ఇక చివరికి బంతికి సిక్స్ కొట్టాల్సి ఉండగా కేవలం ఒక రన్ మాత్రమే వచ్చింది దాంతో జింబాబ్వే కు త్రుటి లో అద్భుత విజయం చేజారింది. తమీమ్ ఇక్బాల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇక మూడు వన్డే ల సిరీస్ లో మొదటి వన్డే లోకూడా బంగ్లాదేశ్ గెలవడంతో సిరీస్ ను 2-0 తో కైవసం చేసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: