కాసులు కురిపించే పొట్టి క్రికెట్ లీగ్...  ఐపీఎల్ కు ఎలాంటి ఆదరణ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ఐపీఎల్ ను గ్రాండ్ సక్సెస్ చేయడానికి బీసీసీఐ సన్నాహాలు చేస్తుంది. మరి కొద్దీ రోజుల్లో ఈ ఐపీఎల్ హంగామా షురూ కానుంది. అయితే ఈసీజన్ కు ముందు బీసీసీఐ ఊహించని నిర్ణయం తీసుకుంది.ఈ ఏడాది ఐపీఎల్ ప్రైజ్ మనీని భారీగా తగ్గిస్తూ ఆదేశాలు జారీచేసింది.  గత సీజన్ ఐపీఎల్ విజేత ప్రైజ్ మనీ  20కోట్లు  ఉండగా ఈ సీజన్ దాన్ని 10కోట్లకు పరిమితం చేశారు అలాగే రన్నర్ అప్ ప్రైజ్ మనీ గత ఏడాది 12.5 కోట్లు గా ఉండగా ఈఏడాది 6.25 కోట్లు గా నిర్ణయించారు. ఇక మూడు ,నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు గత ఏడాది 6..25కోట్ల ప్రైజ్ మనీ దక్కగా ఈఏడాది దాన్ని 4.37 కోట్లకు పరిమితం చేశారు. 

 

దీనితోపాటు ఐపీఎల్ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వడానికి స్టేట్ అసోసియేషన్స్ కు  ఇంతకుముందు ప్రతి మ్యాచ్ కు ప్రాంఛైజీలు 30లక్షలు చెల్లించాల్సి ఉండగా ఇప్పుడు ఆ రుసుమును మరో 20లక్షలు పెంచుతూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అలాగే బీసీసీఐ కూడా ఐపీఎల్ ప్రాంచైజీలతో పాటు అంతే మొత్తాన్నిస్టేట్ అసోసియేషన్ లకు చెల్లించాల్సి ఉంటుంది.  ఆ లెక్కన స్టేట్ అసోసియేషన్లు  ఈ సీజన్ లో ప్రతి మ్యాచ్ కు కోటి రూపాయలు తీసుకోనున్నాయి.  

 

ఇదిలావుంటే మార్చి 29న ఐపీఎల్ 13సీజన్ ప్రారంభమై మే 24న ముగియనుంది. ఈ సీజన్ లో కొన్ని మార్పులు చేసింది బీసీసీఐ.  ఈ ఏడాది ఐపీఎల్ 50రోజులపాటు జరుగనుంది అలాగే శనివారాలు కేవలం ఒక మ్యాచ్ మాత్రమే జరుగనుండగా ఆదివారాలు రెండు మ్యాచ్ లు జరుగనున్నాయి. మొదటి మ్యాచ్ వాంఖడే వేదికగా డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ,చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: