విరాట్ కోహ్లీ ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్ మెన్... ఎలాంటి బౌలర్ నైనా  ఎదుర్కొని భారీ స్కోరును నమోదు చేయగలరు. కానీ విరాట్ కోహ్లీ ఆటకి ఏమైందో తెలీదు  కానీ న్యూజిలాండ్ పర్యటనలో మాత్రం బౌలర్ల కంటే తక్కువ స్కోరు చేశాడు విరాట్ కోహ్లీ. దీంతో విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ ఆటపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ జట్టును ముందుండి నడిపించడంలో విఫలం అయ్యాడు అంటూ చాలామంది విరాట్ కోహ్లీ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంతోమంది క్రికెట్ ప్రముఖులు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే రెండో మ్యాచ్ ముగిసిన అనంతరం విరాట్ కోహ్లీ భారత్ కు వచ్చినప్పుడు నేనేంటో చూపిస్తా అంటూ వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. 

 

 

 

 అంతేకాకుండా మైదానంలో మ్యాచ్ ఆడుతున్న సమయంలో... విరాట్ కోహ్లీ ప్రవర్తించిన తీరుపై కూడా ఎన్నో విమర్శలు వస్తున్నాయి విరాట్ కోహ్లీ ప్రవర్తన తీరు.. ఆట స్ఫూర్తి  స్వభావం కాదు అంటూ ఎంతో మంది విరాట్ కోహ్లీ పై  విమర్శలు చేస్తున్నారు. ఇక ఇదే అదునుగా భావించిన ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ జాన్సన్ తాజాగా విరాట్ కోహ్లీ పై విమర్శలు చేస్తూ సెటైర్లు వేశాడు. మామూలుగానే ఈ ఇద్దరికీ పడదు అన్న విషయం తెలిసిందే. 2014 పర్యటనలో ఇద్దరి మధ్య పెద్ద వివాదమే నడిచింది. జాన్సన్ కవ్వింపులన్నింటికీ  విరాట్ కోహ్లీ బ్యాటుతో సమాధానమిచ్చాడు. అయితే న్యూజిలాండ్ పర్యటనలో విరాట్ కోహ్లీ పూర్తిగా పేలవ ప్రదర్శన చేసిన  నేపథ్యంలో తీవ్ర విమర్శలు వస్తుండగా...  ఇక ఇదే అదనుగా భావించిన ఆస్ట్రేలియా పేసర్ జాన్సన్ విరాట్ కోహ్లీని మరోసారి టార్గెట్ చేసి సెటైర్లు వేశాడు. 

 

 

 భారత్ వచ్చినప్పుడు తాను ఏంటో చూపిస్తాను అంటూ సహచర  ఆటగాళ్లతో ప్రత్యర్థులను కోహ్లీ హెచ్చరించారని...  కోహ్లీ వ్యాఖ్యలు తనకు ఎంతగానో నవ్వు తెప్పించాయి అంటూ ఆస్ట్రేలియా పేసర్ జాన్సన్ కామెంట్ చేశాడు. ఈ మేరకు విరాట్ కోహ్లీ వ్యాఖ్యలను స్క్రీన్ షాట్ తీసి ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశాడు జాన్సన్. ఇక ఇది చూస్తే నాకు నవ్వు ఆగటంలేదు అంటూ క్యాప్టెన్ కూడా పెట్టడంతో ఈ పోస్టు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అయితే టెస్టు మ్యాచ్ల్లో ఓడి పోవటానికి  అనంతరం జట్టు సమిష్టిగా విఫలం  కారణంగానే తాము విజయం సాధించలేకపోయాము విరాట్ కోహ్లీ ఓటమిని అంగీకరించిన విషయం తెలిసిందే. ఇకనుంచి జట్టులో ఇలాంటి తప్పులు జరగకుండా పదునైన వ్యూహాలతో ముందుకు సాగుతామని విరాట్ కోహ్లీ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: