పల్లెకెలె వేదికగా బుధవారం శ్రీలంక తో జరిగిన మొదటి టీ 20లో 25పరుగుల తేడాతో వెస్టిండీస్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20ఓవర్ల లో 4వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. హార్డ్ హిట్టర్లు రస్సెల్ ,పోలార్డ్ క్రీజ్ లో ఉన్నంత సేపు విధ్వసం సృష్టించారు. 14బంతుల్లో 4సిక్సర్లు ,2 ఫోర్ల సాయం తో రస్సెల్ 35పరుగులు చేయగా కెప్టెన్ పోలార్డ్ 15బంతుల్లో 3ఫోర్లు ,2సిక్సర్ల తో 34పరుగులు చేశాడు. వీరికి తోడు ఓపెనర్ సిమ్మన్స్ (67*) రాణించాడు. 
 
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక 56పరుగులకే 5వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ 5 వికెట్లు విండీస్ బౌలర్ ఒషానే థామస్ పడగొట్టడం విశేషం. అయితే ఈ దశలో కుశాల్ పెరెరా(66), హాసరంగా(44) లంక ను ఆదుకున్నారు. వీరిద్దరి దూకుడు చూస్తే శ్రీలంక విజయం సాధించేలానే కనిపించింది కానీ 151 పరుగుల వద్ద పెరెరా అవుట్ కావడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఆతరువాత 27 పరుగుల వ్యవధిలో చివరి నాలుగు వికెట్లు కోల్పోవడం తో శ్రీలంక కు ఓటమి తప్పలేదు.19.1 ఓవర్ల లో లంకేయలు 171పరుగులకు ఆల్ అవుట్ అయ్యారు. 5వికెట్లతో సత్తా చాటిన థామస్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఇక ఈవిజయంతో  విండీస్ రెండు మ్యాచ్ ల టీ 20సిరీస్ లో 1-0ఆధిక్యం లోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య చివరి మ్యాచ్ శుక్రవారం జరుగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: