బుధవారం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా లమధ్య జరిగిన రెండో వన్డేలో  సౌతాఫ్రికా 6వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. రెండో వన్డే లో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్ల లో 271పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. కెప్టెన్ ఫించ్(69), మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ డి ఆర్సీ షార్ట్ (69) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్ ఎంగిడి 6వికెట్ల తో ఆసీస్ పతనాన్ని శాసించాడు. ఫలితంగా వన్డే ల్లో ఎంగిడి కెరీర్ బెస్ట్ ను నమోదు చేశాడు.
 
అనంతరం లక్ష్యఛేదన లో సౌతాఫ్రికా కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మొదటి ఓవర్ లోనే  కెప్టెన్ డికాక్ , స్టార్క్ బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు. ఈదశలో వన్ డౌన్ బ్యాట్స్ మెన్ స్మట్స్ తో కలిసి మరో ఓపెనర్ మలాన్  ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు. అయితే 41పరుగుల వ్యక్తి గత స్కోర్ వద్ద స్మట్స్ అవుట్ కావడంతో వీరి భాగస్వామ్యానికి తెర పడింది. ఈక్రమం లో క్లాసేన్ తో కలిసి మలాన్ మరో విలువైన భాగస్వామ్యాన్నినెలకొల్పాడు. హాఫ్ సెంచరీ చేశాక  క్లాసెన్ వెనుదిరిగినా మిల్లర్ తో కలిసి అద్భుతమైన శతకంతో మలాన్  సౌతాఫ్రికా కు విజయాన్ని అందించాడు. మలాన్ 129*,మిల్లర్ 37* పరుగులతో అజేయంగా నిలిచారు. కాగా మలాన్ కు కెరీర్ లో ఇదే మొదటి సెంచరీ కావడం విశేషం. ఇక ఇరు జట్ల మధ్య మూడో వన్డే శనివారం జరుగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: