ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ శనివారం సౌతాఫ్రికా తో జరుగనున్నచివరి వన్డే కు దూరమైయ్యాడు. దానికి కారణం తన భార్య మహిళల టీ 20 ప్రపంచ కప్ ఫైనల్ ఆడనుండడమే. ఆదివారం ,మెల్బోర్న్ వేదికగా  ఈమెగా టోర్నీ ఫైనల్ లో ఆస్ట్రేలియా, టీమిండియా మహిళా జట్టును ఢీ కొట్టనుందని తెలిసిందే.  కాగా ఆస్ట్రేలియా జట్టుకు ,స్టార్క్ సతీమణి హీలీ ఓపెనర్ గా ప్రాతినిధ్యం వహిస్తుండడం తో ఆ మ్యాచ్ ను చూసేందుకు స్టార్క్ శనివారం మెల్బోర్న్ బయల్దేరనున్నాడు దాంతో చివరి వన్డే కు అతను అందుబాటులో ఉండడం లేదు. 
 
మూడు వన్డేల సిరీస్ లో ఇప్పటికే సౌతాఫ్రికా 2-0తో సిరీస్ ను గెలుచుకుంది.. చివరి వన్డే నామమాత్రమే కావడం తో స్టార్క్ కు మెల్బోర్న్ వెళ్ళడానికి క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతిచ్చింది. ఇక టీ 20వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొదటి సారి ఈ మెగా టోర్నీ లో భారత్ ఫైనల్ చేరుకుంది. మరి టీమిండియా పురుషుల జట్టు లాగే కప్ కొట్టి హర్మాన్ ప్రీత్ కౌర్ సేన చరిత్ర సృష్టిస్తుందో లేదో చూడాలి. మరో వైపు టీ 20 ప్రపంచ కప్ లో వరసగా ఆరోసారి ఫైనల్ కు చేరిన ఆస్ట్రేలియా వుమెన్ టీం సొంత గడ్డ పై కప్ గెలవాలనే పట్టుదలతో వుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: