పి.వి. సింధు ప్ర‌ముఖ బ్యాడ్‌మెంట‌న్ క్రీడాకారిణి రంగంలోకి దిగింది అంటే చిరుత పులే. ప్ర‌త్య‌ర్ధి ఎవ‌రైనా స‌రే ల‌క్ష్యం మాత్రం ఒక్క‌టే అదే గెలుపు. ఎంతో క‌ష్ట‌మైన బ్యాడ్మెంట్న్‌సింగిల్స్‌లో దూసుకుపోతుంది. క‌ష్టేఫ‌లి అన్న మాట‌ను నిజం చేస్తూ త‌ల్లిదండ్రుల ప్రోత్సాహం. గురువు గోపీచంద్ శిక్ష‌ణ‌లో ప్ర‌త్య‌ర్ధుల‌కు చ‌మ‌టలు ప‌ట్టిస్తుంది సింధు. 1995లో పి.వి. సింధు జ‌న్మించింది. ఈమె పూర్తి పేరు పూస‌ర్ల వెంక‌ట సింధు. స్వ‌త‌హాగా పివి త‌ల్లిదండ్రులిద్ద‌రూ వాలీబాల్ క్రీడాకారులు. వాళ్ళ పూర్వీకులు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా వాస్త‌వ్యులు కాగా. తండ్రి ర‌మ‌ణ ఉద్యోగ రిత్యా హైద‌రాబాద్‌లో స్థిర‌ప‌డ్డారు. ర‌మ‌ణ‌కు 2000 సంవ‌త్స‌రంలో అర్జున పుర‌స్కారం ల‌భించింది. ఆయ‌న‌కు స్పోర్ట్స్ కోటాలోనే రైల్వే ఉద్యోగం సాధించారు. క్రీడ‌ల మీద త‌మ‌కున్న ఆశ‌క్తే సింధులో గ‌మ‌నించిన వారు సింధుని 8 సంవ‌త్స‌రాల వ‌య‌సులోనే బ్యాట్‌మెంట్‌న్‌లో చేర్పించారు.

 

మొద‌టిసారి టాప్ 20 జాబితాలో చోటు ద‌క్కించుకోవ‌డం వ‌ల్ల మొద‌టిసారిగా అంత‌ర్జాతీయ గుర్తింపు ల‌భించింది. చైనా అంత‌ర్జాతీయ స‌మాక్య‌ నిర్వహించిన ప్ర‌పంచ చాంపియ‌న్ షిప్ ప‌త‌కాన్ని సంపాదించి అలా గెలిచిన మొట్ట మొద‌ట భార‌తీయురాలిగా రికార్డు సృష్టించింది. త‌ర్వాత మార్చ్ 30చ‌2015 సింధుకి ప‌ద్మ‌శ్రీ‌ని ప్ర‌ధానం చేశారు. దీంతో దేశం ప‌ట్ల త‌న బాధ్య‌త మ‌రింత పెరిగింద‌ని భావించిన సింధు ఆట పై మ‌రింత ప‌ట్టును సాధించింది. త‌న కోచ్ పుల్లెల‌గోపిచంద్ ఆధ్వ‌ర్యంలో నిరంత‌రం సాధ‌న చేస్తూ ఉండే సింధు కృషి ఫ‌లించింది. ఆగ‌స్టు 18 2016లో రియో ఒలంపిక్స్‌లో జ‌రిగిన సియో ఫైన‌ల్‌లో జ‌పాన్‌కు చెందిన ఒకూహ‌రాని ఓడించ‌డం ద్వారా ఒలంపిక్స్‌లో బ్యాడ్‌మెంట‌న్ విభాగంలో ఫైన‌ల్‌కు చేరిన తొలి భార‌తీయ మ‌హిళ‌గా పేరు గాంచింది.

 

త‌ర్వ‌త జ‌రిగిన ఫైన‌ల్‌లో ర‌జ‌త ప‌త‌కం సాధించి ఒలెంపిక్స్‌లో ర‌జ‌తం సాధించిన మొట్ట మొద‌టి భార‌తీయ క్రీడాకారిణిగా అత్యంత చిన్న వ‌య‌స్కురాలైన భార‌తీయురాలిగా నిలిచింది. ఇక 25.8.2019 ఆదివారంరోజున జ‌రిగిన ప్ర‌పంచ ఛాంపియ‌న్ షిప్‌లో స్వ‌ర్ణం సాధించింది. త‌ను ఈ స్థాయికి చేరుకోవ‌డానికి త‌ల్లిదండ్రుల ప్రోత్సాహం ఒక కార‌ణ‌మ‌యితే త‌న కోచ్ పుల్లెల గోపిచంద్ స్ఫూర్తిగా తీసుకుని త‌న స‌ల‌హాలు సూచ‌న‌లు పాటించ‌డం మ‌రో కార‌ణ‌మ‌ని సింధు చెప్పుకుంటారు. సింధు ఆట చూస్తూ ముచ్చ‌ట‌ప‌డిన మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండుల్‌క‌ర్ బిఎండ‌బుల్‌యు కారును సింధుకి బ‌హుమ‌తిగా అందించారు. ఇక సింధు ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి అంతేకాదు ఫ్యాష‌న్ ఐకాన్‌గా కూడా మారిపోయారు సింధు. ఇక రెండు రాష్ట్రాల సీఎంలు ఆమెకు ఘ‌నంగా స‌న్మానం చేయ‌డ‌మే కాక ఆమెకు రెండు చోట్ల ఇళ్ళ స్థ‌లాన్ని కూడా కేటాయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: