టీం ఇండియాలో మళ్ళీ విభేదాలు మొదలయ్యాయా..? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. టీం ఇండియా క్రికెటర్ల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువగా ఉందని అంటున్నారు. దీనికి స్పష్టమైన కారణం అనేది ఏమీ తెలియకపోయినా... విరాట్ కోహ్లి వ్యతిరేక వర్గం అనేది టీం లో తయారు అయింది అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. టీంలో రోహిత్ శర్మ విషయంలో కొందరు ఆటగాళ్ళు కాస్త అతి చేస్తున్నారు అంటున్నారు. 

 

ఈ మధ్య కోహ్లీ టి20 కెప్టెన్ గా తప్పుకునే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతూ వచ్చింది. దీనితో రోహిత్ శర్మను ఆ ఫార్మాట్ కి ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే రోహిత్ కాదు కెఎల్ రాహుల్ ని ఎంపిక చెయ్యాలి ఆ ఫార్మాట్ కి అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. రోహిత్ శర్మ అయితే కుదరదు... అని కొందరు ఆటగాళ్ళు చెప్పినట్టు సమాచారం. ఒక కీలక బౌలర్ ఇదే విషయాన్ని బోర్డ్ కి చెప్పాడని అంటున్నారు. 

 

బోర్డు లో ఒక కీలక అధికారికి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. దీని వెనుక కోహ్లీ ఉండవచ్చని అంటున్నారు. ప్రస్తుతం టీంలో కోహ్లీ విషయంలో రోహిత్ కాస్త అసహనంగానే ఉన్నాడని అంటున్నారు. కెఎల్ రాహుల్ కోహ్లీ కి అత్యంత ఇష్టుడు. దీనితో అతన్ని తన తర్వాత టీం ఇండియా కెప్టెన్ ని చెయ్యాలని కోహ్లి భావిస్తున్నాడని అంటున్నారు. యువకుడు కావడం, అన్ని ఫార్మాట్ లకు ఆడటం తో కోహ్లీ కాస్త పట్టుదలగా ఉన్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: