మహిళల టీ 20ప్రపంచ కప్ రేపటి తో ముగియనుంది. ఈమెగా టోర్నీ ఫైనల్ లో ఆస్ట్రేలియా ను  టీమిండియా ఢీ కొట్టనుంది. ఈటోర్నీ లో ఫైనల్ కూడా చేరడం ఆసీస్ కు వరసగా ఇది 6వ సారి కాగా టీమిండియా కు మాత్రం ఇదే మొదటి సారి దాంతో ఎలాగైనా కప్ గెలిచి భారత్ లో అడుగుపెట్టాలని హర్మాన్ ప్రీత్ కౌర్ సేన పట్టుదలతో వుంది. ఇక సొంత గడ్డపై ఆడనుండడం ఆసీస్ కు కలిసి రానుంది. 
 
ఇప్పటివరకు ఓవరాల్ గా టీ 20 ల్లో ఇరు జట్లు 19 సార్లు తలపడగా అందులో 13 సార్లు కంగారులు విజయం సాధించారు 6సార్లు భారత్ గెలుపొందింది. టీ 20 ప్రపంచ కప్ లో ఇరు జట్లు నాలుగు సార్లు తలపడగా చెరో రెండు సార్లు విజయం సాధించాయి. దాంతో రేపు హోరాహోరి పోరు ఖాయంగా కనిపిస్తుంది. మెల్బోర్న్ వేదికగా జరుగనున్న ఈమ్యాచ్ కు ఇప్పటికే 75000 టికెట్లు అమ్మడైయ్యాయని సమాచారం. భారత కాలమాన ప్రకారం రేపు మధ్యాహ్నం 12:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్ కు వరుణుడు అడ్డుపడే అవకాశాలు లేవు. 
 
తుది జట్లు (అంచనా ) : 
 
భారత్ : షఫాలీ వెర్మ, స్మృతి మందాన, హర్మాన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), రోడ్రిగస్,పూనమ్ యాదవ్, రాజేశ్వరి ,తానియా భాటియా (వికెట్ కీపర్), షికా పాండే, రాధా యాదవ్, దీప్తి శర్మ,వేద కృష్ణమూర్తి 
 
ఆస్ట్రేలియా : హీలీ (కీపర్),మూనీ ,గార్డ్నర్, లన్నింగ్( కెప్టెన్), హెయిన్స్, నికోలా క్యారీ, జోనస్సేన్, స్ట్రానో ,కిమ్మిన్సి , మోలీనక్స్, మేగాన్ షట్  

మరింత సమాచారం తెలుసుకోండి: