సౌతాఫ్రికా తో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో 3-0తో ఓడిపోయి సఫారీల చేతిలో వైట్ వాష్ కు గురైంది ఆస్ట్రేలియా. అందులో భాగంగా శనివారం జరిగిన మూడో వన్డే లో ఆసీస్ పై సౌతాఫ్రికా 6వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత ఓవర్ల లో 7 వికెట్ల నష్టానికి 254పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరో సారి నిరాశపరచగా కెప్టెన్ ఫించ్, స్మిత్ కూడా ఎక్కువ సేపు క్రీజ్ లో నిలువలేకపోయారు. దాంతో ఆసీస్ 55పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఈదశ లో డి ఆర్సీ షార్ట్ తో కలిసి లబుషెన్ ఇన్నింగ్స్ ను నిర్మించాడు.
 
అయితే స్మట్స్ ఈజోడిని విడదీశాడు. 31ఓవర్ లో డి ఆర్సీ షార్ట్(36) క్యాచ్ అవుట్ కాగా ఆతరువాత మార్ష్ , రిచర్డ్ సన్ తో లబుషెన్ మరిన్నిపరుగులు జోడించాడు ఈ క్రమం లో లబుషెన్ (108) కెరీర్ లో మొదటి సెంచరీ పూర్తి  ఇన్నింగ్స్ చివరి బంతికి అవుట్ అయ్యాడు. అనంతరం 45.3 ఓవర్ల లో 4వికెట్లు కోల్పోయి సౌతాఫ్రికా లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు మలన్ ,డికాక్ త్వరగానే పెవిలియన్ చేరినా స్మట్స్ (84) క్లాసేన్ (68*),వేర్రేయ్న్నే (50) అద్భుతంగా పోరాడి సౌతాఫ్రికా ను విజయ తీరాలకు చేర్చారు. స్మట్స్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా టోర్నీ ఆద్యాంతం రాణించిన క్లాసెన్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్  దక్కింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: