ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో నేడు జరుగుతున్న ఆస్ట్రేలియాతో ఈరోజు జరుగుతున్న మహిళల టీ - 20 వరల్డ్‌ కప్ ఫైనల్ లో భారత్ మహిళల జట్టు ఎంత వరకు సాధించవచ్చు అన్న విషయానికి వస్తే ఇప్ప్పుడు వరకు జరిగిన మొత్తం ఆరు వరల్డ్ కప్ ఫైనల్ లో ఒక్కసారి కూడా భారత జట్టు ఒక్కసారి కూడా అడుగు పెట్టలేదు. అదే ఆస్ట్రేలియా జట్టు జరిగిన అన్ని వరల్డ్ కప్ ఫైనల్స్ ఆడింది. ఇందులో మొత్తం నాలుగు సార్లు విజయం సాధించింది.

IHG

 

ఈ ఒక్క విషయం చాలు మహిళల క్రికెట్ లో ఆస్ట్రేలియా ఆధిపత్యాన్ని తెలియపరచడానికి. కానీ ప్రస్తుత 2020 ప్రపంచ కప్ లో భారత మహిళా జట్టు ఒక్కసారి కూడా ఓడిపోకుండా ఫైనల్ కి చేరడం. ఇందులో ముఖ్యంగా లీగ్ మ్యాచ్ లో మొదటగా జరిగిన ఆస్ట్రేలియా, భారత్ మ్యాచ్ లో భారత్ సేన ఆస్ట్రేలియాని 17 పరుగులతో మట్టి కరిపించింది. కాబట్టి ఈ ప్రపంచ కప్ ఫైనల్ మొత్తం ప్రపంచ దేశాలలో హాట్ టాపిక్ గా ఉంది. 

IHG

 

ఏది ఏమైనా భారత మహిళలు మహిళా దినోత్సవ రోజు ప్రపంచకప్ ని గెలిచి భారత్ కి అందివ్వాలని కోరుకుంటాము. అల్ ది బెస్ట్ ఇండియా ఉమెన్స్ టీం....!

మరింత సమాచారం తెలుసుకోండి: