మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న మహిళల టీ 20 ప్రపంచ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా.. ఓపెనర్లు హీలీ,మూనీ అదిరిపోయే శుభారంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా హీలీ ఫోర్లు ,సిక్సర్ల తో చెలరేగింది. మొదటి ఓవర్ నుండే ఆమె ,భారత బౌలర్ల పై ఎదురుదాడికి దిగింది. అందులో భాగంగా దీప్తి శర్మ వేసిన మొదటి ఓవర్ లో మొదటి బంతిని బౌండరీ కి తరలించి పరుగుల ఖాతా తెరిచిన హీలీ నాలుగో బంతిని కూడా ఫోర్ గా మలచగా  5వబంతికి అదృష్టవశాత్తు అవుట్ అయ్యే ప్రమాదం నుండి తప్పించుకుంది. హీలీ ఇచ్చిన క్యాచ్ ను షఫాలీ వదిలేసింది.
 
ఆతరువాత అదే దూకుడు కొనసాగించిన హీలీ 35బంతుల్లో 7ఫోర్లు ,5 సిక్సర్ల తో 75 పరుగులు చేసి వెనుదిరిగింది. కాగా హీలీ, ఆస్ట్రేలియా మెన్ క్రికెట్ టీం ఆటగాడు మిచెల్ స్టార్క్ సతీమణి అని తెలిసిన విషయమే. ఈమ్యాచ్ ను వీక్షించడానికి స్టార్క్ కూడా స్టేడియంకు వచ్చాడు. ఇక మరో ఓపెనర్ మూనీ మొదట్లో నెమ్మదిగా ఆడిన తరువాత బ్యాట్ ఝుళిపించడంతో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్ల లో 4వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. 54 బంతుల్లో 10 ఫోర్ల తో మూనీ 78పరుగులు చేసి అజేయంగా నిలిచింది. భారత బౌలర్ల లో దీప్తి శర్మ 2వికెట్లు తీయగా పూనమ్ యాదవ్ ,రాధా యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు. అయితే భారత్ కు ఈ టార్గెట్ ను ఛేదించడం అంత ఈజీ కాదు.. ఓపెనర్లు షఫాలీ ,స్మృతి మందాన తోపాటు కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ కూడా రాణిస్తేనే భారత్ గెలుపు సాధ్యమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: